నేషనల్ రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్ లో తమ సత్తా చాటేందుకు ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు కఠోర సాధన చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ రింక్ లో హాకీ, శివాజీపాలెంలో ఆర్టిస్టిక్, వుడా పార్క్ లో స్పీడ్ అంశాల్లో మన జట్లు సాధన చేస్తున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జట్లు వేర్వేరు రింక్ లలో ప్రాక్టీస్ చేస్తున్నాయి.
ఈ నెల 18 నుంచి మొదలయ్యో 57 వ జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్ కోసం. వుడా పార్కు లో నిర్వాహక కమిటీ కార్యాలయం ఏర్పాటు చేసింది. నిర్వాహక కమిటీ చైర్మన్ ఎస్. శివలింగ ప్రసాద్ కార్యాలయం ప్రారంభించారు. పోటీల నిర్వాహణ కోసం వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న సాంకేతిక సిబ్బందికి ప్రధాన కార్యదర్శి భగీరధ కుమార్ సహా పలువురు కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. వి. ఎం. ఆర్. డి. ఎ. వైస్ చైర్మన్ కోటేశ్వర రావు చాంపియన్ షిప్ ఏర్పాట్లను పరిశీలించారు.