సరుకు రవాణాలో చరిత్ర సృష్టించిన విశాఖపట్నం పోర్ట్
డా. ఎం. అంగముత్తు, ఐఏఎస్, చైర్మన్ సమర్ధవంతమైన నాయకత్వంలో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (వీపీఏ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం 345 రోజుల్లోనే 85.07 మిలియన్ మెట్రిక్ టన్నుల (MMT) సరుకు రవాణా చేసి చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. విశాఖపట్నం పోర్ట్ యొక్క 92 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యధిక సరుకు నిర్వహణ కావడం విశేషం.
పోర్ట్కు నిర్దేశించిన 90 MMT సరుకు నిర్వహణ లక్ష్యాన్ని సాధించాలని డా. ఎం. అంగముత్తు, ఐఏఎస్, చైర్మన్, వీపీఏ బృందాన్ని నిరంతరం ప్రోత్సహిస్తూ, సమర్థవంతంగా మార్గనిర్దేశనం చేస్తున్నారు. బలమైన నాయకత్వం మరియు స్పష్టమైన వ్యూహాత్మక దృష్టితో ఈ సవాలుతో కూడిన లక్ష్యాన్ని కూడా పోర్ట్ విజయవంతంగా సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ విశేష విజయంతో పోర్ట్ యొక్క సమర్థవంతమైన కార్యకలాపాలు, మెరుగైన సామర్థ్యం, భాగస్వామ్య సంస్థలతో సమన్వయం మరియు సరుకు నిర్వహణలో నిరంతర వృద్ధి స్పష్టంగా ప్రతిఫలిస్తోంది.
ఈ మైలురాయిని సాధించేందుకు కృషి చేసిన పోర్ట్ బృంద సభ్యులందరినీ అభినందించారు. అలాగే అన్ని భాగస్వామ్య సంస్థల సమన్వయంతో కూడిన సహకారాన్ని ప్రశంసిస్తూ, 2026–27 ఆర్థిక సంవత్సరంలో 100 MMT సరుకు నిర్వహణ లక్ష్యాన్ని కూడా విజయవంతంగా సాధించగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.












