విశాఖపట్నం బీచ్ వద్ద బీచ్ కోత నివారణ పనులు ప్రారంభం

బీచ్ కోత నివారణకు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (వీపీఏ) న్యూ సాండ్ ట్రాప్ (NST), దాని అప్రోచెస్ మరియు పోర్ట్ పరిధిలోని ఇతర ప్రాంతాలు అయిన OHTB, OB-1, OB-2, MPB, IC మరియు IHTB వద్ద వార్షిక నిర్వహణ డ్రెడ్జింగ్ పనులను ప్రారంభించింది.
మొత్తం రూ. 82.98 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు మూడు సంవత్సరాల పాటు (2025-26, 2026-27, 2027-28) అమలు చేయబడుతుంది. ఈ డ్రెడ్జింగ్ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం 2.50 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించి, ఆ ఇసుకను తీర ప్రాంతానికి పంపింగ్ చేయడం ద్వారా తీర ప్రాంతంలో కోత నివారించవచ్చు. ప్రతి సంవత్సరం ఈ పనులు 45 వాతావరణ అనుకూల పనిదినాలలో పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించారు.
ఈ మూడు సంవత్సరాల ప్రాజెక్టులో భాగంగా 2025-26 సంవత్సరానికి సంబంధించిన డ్రెడ్జింగ్ పనులు 10 మార్చి 2026న డ్రీడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నౌక “డ్రెడ్జ్ XXI” ద్వారా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా డా. మాధైయాన్ అంగముత్తు, ఐఏఎస్, చైర్పర్సన్, వీపీఏ & డీసీఐ మాట్లాడుతూ, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ రామకృష్ణ బీచ్ వద్ద తీర క్షీణతను నియంత్రించేందుకు ఔటర్ హార్బర్లోని సాండ్ ట్రాప్‌లో లభించే ఇసుకను తరచుగా తీరానికి తరలిస్తూ బీచ్ నరిష్మెంట్ కార్యక్రమాన్ని చేపడుతోందని తెలిపారు. విశాఖ బీచ్‌ను పరిరక్షించడానికి మరియు బలోపేతం చేయడానికి అవసరమైన ముఖ్యమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. విశాఖ నగరంలోని బీచ్‌ల ను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.











