బి.జె.పి జాతీయ అధ్యక్షులు శ్రీ జే.పి నడ్డా గారు ఆంధ్ర ప్రదేశ్ పర్యటనలో భాగంగా రాజమండ్రిలో మేధావులతో ముఖాముఖి సదస్సు జరిగింది. బీ.జే.పీ ఎమ్మెల్సీ శ్రీ మాధవ్ గారు స్వాగతోపన్యాసం లో భారత ప్రధాని మంత్రి శ్రీ మోడీ గారి కోరిక మేరకు ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీని బలోపేతం చేయడంలో మేధావుల పాత్ర ఎంతో వుందని- వివిధ రంగాల్లో జాతీయ పురస్కారాలు అందుకున్న వారిని, పద్మా పురస్కార గ్రహీతల్నీ శ్రీ నడ్డా గారికి పరిచయం చేశారు.
ఉత్తరాంధ్రలో డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గత రెండున్నర దశాబ్దాలుగా చేస్తున్న విశేష సేవల్ని వివరంగా తెలియపరిచారు. శ్రీ నడ్డా గారు డాక్టర్ సూర్యారావును దుశ్శాలువ తో సత్కరించారు. అందుకు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు ధన్యవాదాలు తెలుపుతూ దేశాభివృద్ధిలో, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పురస్కార గ్రహీతలు పాల్గొనడానికి ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
జాతీయ అధ్యక్షులు శ్రీ నడ్డా గారు మాట్లాడుతూ కళలు, విద్య, వైద్యం, సాహిత్యం, వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులు ఎల్లవేళలా దేశ సేవలో నిమగ్నులవ్వాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి గారు భారతదేశ ముఖ చిత్రాన్ని సర్వోన్నతంగా తీర్చిదిద్దుతున్న నేపధ్యంలో అందరి సహకారం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమ వీర రాజు గారు, బీ.జే.పి నాయకురాలు ప్రముఖ సినీ నటి జయప్రద, శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారు పాల్గొన్న సభలో గిరిజన విద్య పై కృషి చేస్తున్న డాక్టర్ ప్రసన్న శ్రీ, కళాకారుడు శ్రీ వై గోపాల్ రావు తదితరులను సత్కరించారు. రాజ్యసభ సభ్యులు శ్రీ జీ.వీ.ఎల్ నరసింహారావు గారు, శ్రీ వై.ఎస్ చౌదరి గారు, ఇతర కేంద్ర బిజెపి నాయకులు పాల్గొన్నారు.















