HomeUncategorizedVisakhapatnam Vizagvision : 14 ఏళ్ల నుంచి నిర్విరామంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దేవి కంఫర్ట్ లైఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శిమ్మ భాగ్యలక్ష్మి ని పలువురు అభినందించారు. అసోసియేషన్ ఏర్పాటు చేసి 14 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం విశాఖ పౌర గ్రంథాలయంలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిధులుగా ప్రముఖ న్యాయవాది, సొసైటీ ఆఫ్ ఇంటలెక్చవల్ వాయిస్ అధ్యక్షుడు ఐ.ఎం.అహ్మద్,డబ్ల్యూ .ఐ. కో-ఆర్డినేటర్ జె.ఉమా దేవి,మేడా బుజ్జమ్మ మోమరల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మేడా మస్తాన్ రెడ్డి,వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు లు హాజరై వృద్ధులకు, వితంతువులకు బియ్యం,పప్పు దినుసులు, చీరలు పంపిణీ చేసారు.ఈ సందర్భంగా అతిధులు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు,న్యాయవాది శిమ్మ భాగ్యలక్ష్మి చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఎంతో మంది నిరుపేదలకు ఆమె చేస్తున్న సేవలు శ్లాఘనీయమైనవన్నారు.భవిష్యత్ లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ఎంతోమందికి బాసటగా నిలవాలని ఆకాంక్షించారు.న్యాయవాది శిమ్మ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సంస్థ 14వ వార్షికోత్సవం సందర్భంగా వృద్ధులకు, వితంతువులకు బియ్యం,పప్పు దినుసులు, చీరలను పంపిణీ చేస్తున్నామని,సంస్థ ప్రారంభించినప్పటి నుంచి నేటివరకు నిర్విరామంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. తమ సొంత నిధులతోనే సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు.విశాఖ లోని పలు ప్రాంతాలలో ఇతర జిల్లాల్లోనూ తమ అసోసియేషన్ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.నిస్వార్ధంగా తాము చేపడుతున్న కార్యక్రమాలను చాలా మంది ప్రముఖులు ప్రసంసిస్తున్నారని వెల్లడించారు.వృద్ధులకు, వితంతువులకు,వికలాంగులకు,నిరుపేద విద్యార్థులకు ఇతోధికంగా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.భవిష్యత్తులో కూడా తమ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.స్నేహాంజలి సంగీత నృత్యాలయం అధ్యక్షులు వి.ఎన్.మూర్తి ఆధ్వర్యంలో ఆహ్లాదంగా జరిగిన ఈ వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన పలు నృత్యాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తనకు సహకరించిన అందరికీ శిమ్మ భాగ్యలక్ష్మి కృతఙ్ఞతలు తెలిపారు.
Visakhapatnam Vizagvision : 14 ఏళ్ల నుంచి నిర్విరామంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దేవి కంఫర్ట్ లైఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శిమ్మ భాగ్యలక్ష్మి ని పలువురు అభినందించారు. అసోసియేషన్ ఏర్పాటు చేసి 14 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం విశాఖ పౌర గ్రంథాలయంలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిధులుగా ప్రముఖ న్యాయవాది, సొసైటీ ఆఫ్ ఇంటలెక్చవల్ వాయిస్ అధ్యక్షుడు ఐ.ఎం.అహ్మద్,డబ్ల్యూ .ఐ. కో-ఆర్డినేటర్ జె.ఉమా దేవి,మేడా బుజ్జమ్మ మోమరల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మేడా మస్తాన్ రెడ్డి,వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు లు హాజరై వృద్ధులకు, వితంతువులకు బియ్యం,పప్పు దినుసులు, చీరలు పంపిణీ చేసారు.ఈ సందర్భంగా అతిధులు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు,న్యాయవాది శిమ్మ భాగ్యలక్ష్మి చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఎంతో మంది నిరుపేదలకు ఆమె చేస్తున్న సేవలు శ్లాఘనీయమైనవన్నారు.భవిష్యత్ లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ఎంతోమందికి బాసటగా నిలవాలని ఆకాంక్షించారు.న్యాయవాది శిమ్మ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సంస్థ 14వ వార్షికోత్సవం సందర్భంగా వృద్ధులకు, వితంతువులకు బియ్యం,పప్పు దినుసులు, చీరలను పంపిణీ చేస్తున్నామని,సంస్థ ప్రారంభించినప్పటి నుంచి నేటివరకు నిర్విరామంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. తమ సొంత నిధులతోనే సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు.విశాఖ లోని పలు ప్రాంతాలలో ఇతర జిల్లాల్లోనూ తమ అసోసియేషన్ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.నిస్వార్ధంగా తాము చేపడుతున్న కార్యక్రమాలను చాలా మంది ప్రముఖులు ప్రసంసిస్తున్నారని వెల్లడించారు.వృద్ధులకు, వితంతువులకు,వికలాంగులకు,నిరుపేద విద్యార్థులకు ఇతోధికంగా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.భవిష్యత్తులో కూడా తమ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.స్నేహాంజలి సంగీత నృత్యాలయం అధ్యక్షులు వి.ఎన్.మూర్తి ఆధ్వర్యంలో ఆహ్లాదంగా జరిగిన ఈ వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన పలు నృత్యాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తనకు సహకరించిన అందరికీ శిమ్మ భాగ్యలక్ష్మి కృతఙ్ఞతలు తెలిపారు.