“అరచేతిలో స్వర్గం” సామెత చంద్రబాబు మాయమాటలు మందు చిన్నబోతుంది
సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ద్వారా గడపగడపకూ చేరువైన పరిపాలన
జిల్లాల పునర్వ్యవస్థీకరణను స్వాగతించిన ఐదున్నర కోట్ల ఆంధ్రులు
ఏపిఐఐసి నూతన పోర్టల్ తో పారిశ్రామిక సేవలన్నీ ఆన్ లైన్ లోనే
ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయి రెడ్డి

విశాఖ స్టీల్ ప్లాంట్ కు రబోధి ఓసీపీ బొగ్గు గని కేటాయింపు రద్దు చేయబడ్డ విషయం తనను తీవ్రంగా బాధించిందని, బొగ్గు గనిని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నప్పుడు ఆర్ఐఎన్ఎల్ మళ్లీ ఎందుకు వేలానికి వెళ్ళాలో నాకు అర్థం కాలేదని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో నడుస్తున్నప్పటికీ అమ్మకం కోసం ఉద్దేశపూర్వకంగా ప్లాంటును నష్ట పరిచేందుకు చేసే అనేక ప్రయత్నాలను చూస్తున్నానని అన్నారు . 2020-21 ఆర్థిక సంవత్సరంలో 28,008 కోట్లు అమ్మకపు టర్నోవర్‌ను నమోదు చేసి రికార్డు సృష్టించిందని, ఈ టర్నోవర్ అంతకుముందు సంవత్సరం కంటే 56 శాతం అధికమని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు.
“అరచేతిలో స్వర్గం” అనే సామెత చంద్రబాబు మాయమాటలు ముందు బోసిపోయి కనిపిస్తుందని. 2019 కల్లా రాష్ట్రంలో 100% అక్షరాస్యత సాధిస్తామని 2015 ఉపాధ్యాయ దినోత్సవం నాడు చిటికెలేసి చెప్పిన చంద్రబాబు 2011లో లిటరసీ రేటు 67% ఉంటే, 2019 లో బాబు దిగిపోయే నాటికి కూడా 67% దగ్గరే ఆగిపోయిందని అన్నారు. మాయ మాటలతో ప్రజలను వంచించడం, ఇచ్చిన వాగ్ధానాలు విస్మరించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని అన్నారు. .
సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో ప్రతి గడపకూ పరిపాలన చేరువయ్యిందని, పౌరసేవల్లో వేగం, పారదర్శకత పెరిగిందని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు అందుతున్నాయని అన్నారు. విద్య, వైద్య రంగాల్లో చేపట్టిన సంస్కరణలతో ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రుల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని అన్నారు. రేషన్ సరుకులను డోర్ డెలివరీ చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు.
జిల్లాల పునర్వ్యవస్థీకరణ అత్యంత శాస్త్రీయంగా జరిగిందని అన్నారు. పాలనా సౌలభ్యం, అధికార, అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన 26 జిల్లాలు ఆణిముత్యాల్లా అభివృద్ధి చెందుతాయని అన్నారు. నాలుగు జిల్లాలకు ఎన్టీఆర్, అల్లూరి, అన్నమయ్య, శ్రీసత్యసాయి పేర్లు పెట్టి సీఎం జగన్ వారిని చిరస్మరణీయులు చేసారని అన్నారు. ఎవరెంత ఏడ్చినా ఐదున్నర కోట్ల మంది ప్రజలు మాత్రం ముఖ్యమంత్రి నిర్ణయాన్ని పెద్ద ఎత్తున స్వాగతించారని అన్నారు.
రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పే పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని రకాల సేవలు ఒకేచోట అందించేలా ఏపీఐఐసీ ఆన్లైన్ వ్యవస్థను రూపొందించిందని తెలిపారు. ఏపీఐఐసీ పరిశ్రమల శాఖతో అనుసంధానించటం ద్వారా భూమి కోసం దరఖాస్తు చేసుకునే దగ్గర నుంచి కంపెనీ వాటాల విక్రయం వరకు అన్ని సేవలనూ ఒకే క్లిక్ తో పొందే అవకాశాన్ని కల్పించిందని అన్నారు. పౌరసేవల పేరుతో ఏపిఐఐసి నూతన పోర్టర్ ప్రారంభించిందని, 14 రకాల సేవలు అందుబాటులో ఉంచిందని అన్నారు.
దేశంలో లక్ష మందికి ఏఐసీటీఈ నైపుణ్య శిక్షణకు ఏర్పాట్లు చేస్తుండగా అంతకు మించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందిస్తోందని అన్నారు మైక్రోసాఫ్ట్ సంస్థ ద్వారా 40కి పైగా ఐటీ కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తోందని, రాష్ట్రంలోని 1.60 లక్షల మంది ఇప్పటికే ఈ కోర్సులకు ఎంపికయ్యారని దీనికి అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తోందని అన్నారు.












