విశాఖజిల్లాలో తిరుగుతున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాస్తవాలు తెలియకుండా మాట్లాడంతో శోచనీయమని పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత మండిపడ్డరు. పాయకరావుపేట నియోజకవర్గంలో అభివృద్ది జరగలేదని ఆరోపిస్తున్న జగన్, తాను చేసిన అభివృద్ది చూపించేందుకు, తనపై చేసిన ఆరోపణలకు బహిరంగ చర్చకు సిద్దంగా వున్నానని సమాలు విసిరారు. నాటుగేళ్లగా ప్రజా సంక్షేమ పథకాలన్ని ప్రజలకు అందే విధంగా తాను చొరవ చూపిస్తున్నానని, అర్హులైన వారందరికి ఇళ్లతో పాటు పెన్షన్ లు అందే విధంగా కృషి చేశానన్నారు.