మంచిర్యాల ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద, 10 గేట్లు ఎత్తివేత,,జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 10 గేట్లు శనివారం ఎత్తివేశారు.
గత వారంరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల్లో నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతుండటంతో ప్రాజెక్టు గేట్లు అధికారులు ఎత్తివేశారు.
దీంతో ప్రాజెక్టుకు చెందిన 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
ప్రస్తుత నీటి నిల్వ 19 టీఎంసీలు, పూర్తిస్థాయి నీటి నిల్వ 20 టీఎంసీలు ఇన్‌ఫ్లో 46 వేల క్యూసెక్కులు
అవుట్‌ఫ్లో 53వేల క్యూసెక్కులు ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.