విశాఖలో తప్పిన ప్రమాదం Bus Catches Fire In Gajuwaka,Visakhapatnam,Vizagvision…
చూట్టూ అపార్టుమెంట్లు….జనావాసాలు …..రద్దీ ప్రాంతం….ఒక్క సారిగా గ్యారేజీలో రిపేర్ కోసం వున్న బస్సు లో మంటలు…. పరుగులు తీసిన నిర్వాహకులు….
మంటలు దగ్గర్లోనే సిలేండర్లు….
గాజువాక జగ్గు జంక్షన్ నుంచి పోర్టుకు వెళ్ళే మార్గంలో రిపేరులో వున్న స్కూలు బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న వారు పారిపోయారు. కంగారులో బస్సుదగ్గర్లో వున్న సిలేండర్లను అక్కడే వదిలేసి పారిపోయారు. ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది…చుట్టూ అపార్టుమేంట్లు లో వున్నవారు …స్ధానికులు భయబ్రాంతులకు గురయ్యారు. బస్సు దగ్గర వున్న సిలేండర్లను కొంతమంది యువకులు బస్సు నుంచి దూరంగా తరలించడం పెను ప్రమాదం తప్పింది. గ్యారేజీ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం సంభవించిందని స్ధానిక మహిళలు ఆరోపిస్తున్నారు. గ్యారేజ్ లో నిత్యం మంటలు పెడుతున్నారని ఎన్ని సార్లు చెప్పినా వినడంలేదని ఆరోపిస్తున్నారు. బస్సు మొత్తం పుర్తిగా దగ్ధం అయ్యింది. తరువాత ఫ్తెర్ ఇంజన్ వచ్చి మగిలిమంటలను అదుపుచేసింది. అదే సమయంలో ఘటనా స్ధలానికి గాజువాక పోలీసులు చేరుకుని ఎలా ప్రమాదం జరిగింది అనే విషయమ్తె ఆరా తీస్తున్నారు..
















