ధనుర్మా ఉత్సవాలు హంస వాహనంలో స్వామి వారి తిరువీధిసేవ ఉపమాక శ్రీవేంకటేశ్వర స్వామి Visakhapatnam,Vizagvision….
హంస వాహనంలో స్వామి వారి తిరువీధిసేవ
మండలంలోని ఉపమాక శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
18 వ రోజు ఆలయంలో నిత్య పూజలు నిర్వహించిన తరువాత ఉభయదేవేరులతో స్వామి వారిని హంసవాహనపైన ఆండాళ్ అమ్మవారిని పల్లకీలోను వేంచేపుచేసి గ్రామ తిరువీధిసేవ నిర్వహించారు.
అనంతరం ఆండాళ్ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక నీరాజన మంత్రపుష్పాలు, తీర్ధగోష్ఠి, ప్రసాద వినియోగం జరిగింది.
సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఉదయం కూరపాటి రోహిణి చే ధనుర్మాస వ్రత వైభవం ప్రవచనం నిర్వహించారు. మద్యాహ్నం అన్నమాచార్య ప్రాజెక్టు, ధర్మప్రచార పరిషత్తు వారిచే అన్నమయ్య కీర్తనలు , హరికధలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో అర్చకులు గొట్టుముక్కల వర ప్రసాదాచార్యులు , కృష్ణమాచార్యులు , సిబ్బంది రాజశేఖర్ , గ్రామానికి చెందిన నున్న సుభాష్ , సిద్దాబత్తుల కృష్ణ , పలువురు భక్తులు పాల్గొన్నారు.















