PM Gati Shakti | National Master Plan | Press Meet | Port Trust Authority | Visakhapatnam | Vizagvision గతి శక్తి – జాతీయ బృహత్ ప్రణాళిక భారత 75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక బృహత్ ప్రణాలికను ప్రకటించారు. ప్రధాన మంత్రి గతి శక్తి బృహత్తరప్రణాలిక కోసం సుమారు 100 లక్షల కోట్ల బడ్జెట్ ను కేటాయించారు. ఇందులో భాగంగా సంపూర్ణ మౌలిక వసతుల కల్పన పై దృష్టి సారించనున్నారు. అక్టోబర్ 13 2021 న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. గతి శక్తిలో భాగంగా 2024-25 నాటికి దేశంలో 2 లక్షల కిలోమీటర్ల జాతీయ రహదారుల కల్పన, రైల్వే ల ద్వారా 1600 మిలియన్ టన్నుల సరుకు రవాణా వసతులు, 35,000 కిలోమీటర్ల మేర గ్యాస్ పైప్ లైన్ డబ్లింగ్ , 220 ఎయిర్ పోర్టులు, ఎయిర్ స్ట్రిప్ లు మరియు ఎయిరో డ్రోమ్స్ కల్పన, పరిశ్రమల కోసం 25000 ఎకరాల ప్రాంతం, అందులో 11 పరిశ్రమల కారిడార్ ల అభివృద్ది, రక్షణ ఉత్పత్తులపై 1.7 లక్షల కోట్ల టర్నోవర్, 109 ఫార్మా క్లస్టర్లు, 38 ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్ల ఏర్పాటు వంటి కార్యక్రమాలను చేపట్టనున్నారు. బృహత్తరప్రణాలికలో భాగంగా నౌకాయాన పరిశ్రమ 2024-25 నాటికి 1,759 ఎంఎంటిపిఏ సరుకు పోర్టుల ద్వారా రవాణాకు ఏర్పాట్లు. 2020 నాటికి ఇది 1282 ఎంఎంటిపిఏ గా ఉంది. జాతీయ జలరవాణా ద్వారా సరుకు రవాణాను 95 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచాలనేది ప్రాజెక్టు ఉద్దేశ్యం. 2020 నాటికి ఇది 74 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. గంగా నది ద్వారా సరుకు రవాణాను 9 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి ఏకంగా 29 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచే అలోచన. ఈ సందర్భంగా గతి శక్తి ప్రాజక్టు వల్ల దేశ ఆర్ధిక రంగం ఏ విధంగా ముందుకు వేళుతుంది అనే అంశాన్ని పోర్టు చైర్మన్ వివరించారు. కేంద్ర ప్రాణాలికలకు అనుగుణంగా విశాఖపట్నం పోర్టు అధారిటీ సైతం తన పరిధిలోని పలు ప్రాజెక్టులను, మౌలిక వసతుల కల్పనను మరింతమెరుగు పరిచేందుకు పలు చర్యలు తీసుకునేందుకు ప్రాణాలికలు రూపొందించిందిఅని చైర్మన వెల్లడించారు. ఇందులో భాగంగా విశాఖపట్నం పోర్టు అధారిటీ మీడియా ఇంటరాక్షన్ ను నిర్వహించింది. శాలగ్రామపురంలోని సాగరమాల కన్వేన్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు పోర్టు ఆపరేటర్లు స్టివెడోర్స్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా గతి శక్తిలో భాగంగా విశాకపట్నం పోర్టు అధారిటీ చేపడుతున్న పలు ప్రాజెక్టుల వివరాలు… ప్రస్తుతం ఉన్న కంటైనర్ టెర్మినల్ ను 633 కోట్ల రూపాయల వ్యయంతో విస్తరించే పనులను పోర్టు చేపట్టింది. రెండవ టెర్మినల్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ టెర్మినల్ నిర్మాణం వల్ల ఈస్ట్ బ్రేక్ వాటర్స్ నుంచి కాన్వెంట్ జంక్షన్ కూడలి వరకూ వాహనాల రద్దీ పెరగనుంది. కంటైనర్ టెర్మినల్ నుంచి కార్గోను ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా తరలించేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న రెండులైన్ల రోడ్డును 4లైన్లుగా విస్తరించేందుకు ఏర్పాట్లు. 68 కోట్ల రూపాయలతో ఈస్ట్ బ్రేక్ వాటర్స్ నుంచి కాన్వెంట్ కూడలి వరకూ ఈ రోడ్డును విస్తరించనున్నారు. జాతీయ రహదారుల అభివద్దిసంస్ధ ఇందుకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. ఈ నాలుగు లైన్ల రహదారి కాన్వేంట్ కూడలి వద్ద ఉన్న గ్రేడ్ సెపరేటర్ కు అనుసంధానిస్తారు. అక్కడి నుంచి నేరుగా 16వ నంబర్ జాతీయ రహదారికి చేరుకోవచ్చు. సాగర్ మాలా అభివృద్ది కంపెనీ లిమిటెడ్ సహకారంతో సుమారు 210 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 20 ఎకరాల విస్తీర్ణంలో కవర్డ్ స్టోరేజ్ యార్డ్ లను నిర్మించేందుకు ప్రణాలికలు రూపొందించింది. ముందుగా 36.38 కోట్ల రూపాయల పనులకు సంబంధించి బిడ్లను అహ్వానించింది. బిడ్లను తెరిచి పనులను అక్టోబర్ 2021 చివరి నాటికి ప్రారంభిచేందుకు సన్నాహాలు. కార్గో హ్యాండ్లింగ్ సమయంలో దుమ్ము , ధూళి ఎగరకుండా ఉండేందుకు ఈ కవర్డ్ స్టోరేజ్ యార్డ్ లను ఉద్దేశించారు. వీటి నిర్మాణం ద్వారా కాలుష్య నివాణ మండలి, జాతీయ హరిత ట్రిబ్యూనల్ రూపొందించిన కాలుష్య సూచీలను పాటించే వీలు కలుగుతుంది. విశాఖపట్నం పోర్టు ట్రస్టు పరిధిలో ఎగ్జిమ్ పార్క్ ప్రాంతంలో ట్రక్ పార్కింగ్ టెర్మినల్ ను సుమారు 20 ఎకరాల్లో 52.32 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో సుమారు 600 ట్రక్కులు నిలిపేందుకు వసతులు కల్పించనున్నారు. ఈ టెర్మినల్ నిర్మాణం వల్ల సరుకు రవాణా చేసే వాహనాలకు పార్కింగ్ సమస్యను తొలగించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు వీలు కలుగుతుంది. 28 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఉత్తర దక్షిణ , నార్త్ వెస్ట్ , సౌత్ వెస్ట్ క్యాబిన్ లను కలుపుతూ అర్ అండ్ డి యార్డ్ వరకూ ఎలక్ట్రికల్ ఇంటర్ లాకింగ్ సిస్టంను అభివృద్ది పరిచేందుకు చర్యలు. 23 కిలోమీటర్ల మేర పోర్టు రైల్వే విద్యూదీకరణ పనులను మొదటి ఫేజ్ లో భాగంగా పోర్టు యాజమాన్యం పూర్తి చేసింది. రెండవ ఫేజ్ లో పోర్టు రైల్వే విద్యుదీకరణ పనులను మూడు ఫేజ్ లుగా విభజించారు. ఈవిద్యుదీ కరణ పనుల ద్వారా రైలును నేరుగా సైడింగ్స్ పైకి తీసుకువచ్చే అవకాశం కలుగుతుంది. సరుగు రావణలో మరింత వేగవంతంగా పనులు చేసేందుకు అవకాశం కలుగుతుంది. #Vizagvision #GatiShaktiNationalMasterPlan For Inquiries Please WhatsApp us 9948511438 or Vizagvisiondeva@gmail.com And Also Follow Us On : vizagvision Groups Website: http://www.vizagvision.com/ Facebookpage: https://www.facebook.com/vizagvision Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision Please Subscribe My Channel Please Follow This Links Don’t For Got Please Support Me Friends Vizagvision is Political Affairs,Fun, Entertainment, Share Video Clips, Political News,Tourism etc.. All Videos we Presenting in a Short Format. If you want to get all these videos in Vizagvision. For Watch videos,political affairs,Tourism,Entertainment subscribe to my channel. https://www.youtube.com/channel/UCg0Psn8d27qsfso_6b9UuRA












