కరోనా వైరస్ ప్రభావంతో భాషాభేదాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అన్ని సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయాయి.
దినసరి వేతనాలపై ఆధారపడే సినీ కార్మికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.. వారిని ఆదుకునేందుకు ఒక్కొక్కరుగా తారలంతా ముందుకొస్తున్నారు.
తాజాగా తమిళ అగ్ర నటుడు రజనీకాంత్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
దక్షిణ భారత ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌కు యాభైలక్షల విరాళాన్ని అందజేశారు.
ఆయనతో పాటు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి పదిలక్షల విరాళం ప్రకటించారు.
ఇప్పటికే హీరోలు సూర్య, కార్తి ఈ ఫెడరేషన్ పదిలక్షలు అందజేశారు.
వారి బాటలోనే మరికొందరు స్టార్స్ సినీ కార్మికులను ఆదుకునేందుకు సిద్ధమవుతున్నారు.















