వైజాగ్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నూతన చిత్రం
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించిన తొలి షూటింగ్ షెడ్యూల్ కొద్ది రోజులు క్రితం వైజాగ్ లో ప్రారంభమై తాజాగా ముగిసింది. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అందమైన లొకేషన్స్ ఈ షెడ్యూల్ ని షూట్ చేసినట్లుగా చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో పాటు చిత్రంలో ఉన్న కీలక పాత్రధారుల పై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించినట్లుగా దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెలిపారు. ప్రస్తుతం తదుపరి షెడ్యూల్ కి సంబంధించిన వర్క్స్ ని ప్లాన్ చేస్తున్నామని కిరణ్ అన్నారు.
హ్యట్రిక్ బ్లాక్ బస్టర్స్ దిశగా వరుణ్ తేజ్

వైవిధ్యమైన కథా చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ ఏడాది `ఎఫ్ 2`, `గద్దలకొండ గణేష్` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్‌ను సొంతం చేసుకున్న మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ చిత్రంతో మరో డిఫరెంట్ లుక్ తో మెగా ఫ్యాన్స్ ని ఖుషీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే వరుస బ్లాక్ బస్టర్స్ తో ఫుల్ స్వింగ్ లో మెగాప్రిన్స్ మరో విజయం తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అని చిత్ర వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సిద్ధు ముద్ద, అల్లు వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రమిది. ఈ సినిమా కోసం అమెరికాకు వెళ్లి ప్రత్యేకమైన శిక్షణ తీసుకుని వరుణ్‌గారు చాలా మేకోవర్ అయ్యారు.

ఇకమ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం, జార్జ్ సి.విలియన్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె.వెంకటేశ్‌గారు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

సాంకేతిక వర్గం
సినిమాటోగ్రఫీ: జార్జ్ సి.విలియమ్స్
మ్యూజిక్: తమన్.ఎస్
ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్
నిర్మాతలు: సిద్ధు ముద్ద, అల్లు వెంకటేశ్
దర్శకత్వం: కిరణ్ కొర్రపాటి















