“Araku Utyas 2020” Cultural Programs & Prizes Distibution Day 2 in Visakhapatnam, Vizagvision….
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెండు రోజుల అరకు ఉత్సవ్ – 2020 ఘనంగా ముగిసింది.
ఫిబ్రవరి 29, మార్చి 1 తేదీలలో రెండు రోజులపాటు గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా, కళారూపాలకు వేదికగా అరకులోయ లోని ఎన్టీఆర్ గ్రౌండ్ లో ఉత్సవాలను జరిపారు.
రెండవ రోజు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కొత్త భల్లుగూడా గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికలు జానపద నృత్యం ప్రదర్శించారు.
విశాఖపట్టణం స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ బాలికలు రేలారే రేలారే నృత్యం ప్రదర్శించారు.
అనంతగిరి ఆశ్రమ పాఠశాల -1 విద్యార్థినిలు రాజస్థాన్ నృత్యం ప్రదర్శించారు.
అనంతగిరి ఆశ్రమ పాఠశాల-2 విద్యార్థినిలు వందేమాతరం గేయానికి అభినయించారు.
గన్నెల ఆశ్రమ పాఠశాల విద్యార్థినిలు ఘల్లు ఘల్లు మనే పాటకు నాట్యం చేశారు.
అరకు వేలి కేజీబీవీ పాఠశాల బాలికలు కోలాటం సాంప్రదాయ నృత్యం ప్రదర్శించారు.
జాము గూడా ఆశ్రమ పాఠశాల బాలికలు రంగోబోతి పాటకు నాట్యం చేశారు.
స్థానిక కళాకారులు తెల్ల గంజి ప్రకాశ్ శ్యామ్ గిటార్ పై పాటలు పాడారు.
శ్రావ్య, మానస బృందం శివ తత్వం పై క్లాసికల్ డాన్స్ చేశారు.
ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా హేమంత్, శ్యామల జనరంజకంగా నిర్వహించారు. అరకులోయలో గిరిజన సంస్కృతి శోభ వెల్లివిరిసింది. భారీగా గిరిజనులు తరలివచ్చారు, ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి తోడ్పడిన వివిధ శాఖల అధికారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంగ్లీ పాడిన పాటలకు స్థానిక ఎమ్మెల్యే పాడేరు ఎమ్మెల్యే స్థానిక ఎంపీ లు స్టేజ్ పైకి వచ్చి మరి డాన్సులు వేయడంతో కోలాహలంగా మారింది.
ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ సభ్యురాలు జి. మాధవి, అరకు శాసనసభ్యులు చెట్టి ఫాల్గుణ, పాడేరు శాసనసభ్యులు కే. భాగ్యలక్ష్మి, ఐ టి డి ఎ ప్రాజెక్ట్ అధికారి డీకే బాలాజీ, సబ్ కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎస్ డి పి ఓ రాజ్ కమల్, పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు రాంప్రసాద్, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విజయ్ కుమార్, తహసీల్దారు శ్యాం బాబు, ఏపీవో ప్రభాకర్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నరు,















