గాలిగోపురం నిర్మాణ శంకుస్థాపన శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి చిన్నముసిడివాడ in Visakhapatnam,Vizagvision…చిన్నముసిడివాడ శ్రమశక్తి నగర్లో వేంచేసియున్న శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి పంచాయితన దేవాలయం నందు ఉత్తర భాగంలో గాలి గోపురం నిర్మాణ శంకు స్థాపన ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు,కమిటీ సభ్యులు శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ సృష్టి నంతటిని తల్లిదండ్రుల వల్లే రక్షించి నిరంతరము ఆయురారోగ్యాలతో మన అందరినీ రక్షిస్తూ నటువంటి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కొరకు ఆలయ అభివృద్ధి కొరకు రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర భాగంలో గాలి గోపురం నిర్మాణము కొరకు నేడు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ నిర్మాణం భక్తుల యొక్క సహాయ సహకారాలతో జరుగుతుందని అన్నారు. ఈ ఆలయం మొదలుపెట్టి 18 సంవత్సరాలు పూర్తి అయిందని దినదిన అభివృద్ధి చెందుతూ భక్తుల కోర్కెలు తీర్చే స్వామివారి గా విరాజిల్లుతున్న అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు…..















