సూర్యకిరణాలు ఆంజనేయ స్వామీ విగ్రహానీ పాధాలను తాకాయి, గన్నవరం, కృష్ణా జిల్లా,Vizagvision..కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామం లో వేంచేసియున్న శ్రీ ఉషా పద్మిని సమేత సూర్యనారాయణ స్వామీ దేవాలయంలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది.
సూర్యుడు తుల రాశి లో కి ప్రవేశించే సమయంలో ఆలయంలొని సూర్య భగవానుడి పాధాలను సూర్యకిరణాలు తాకాయి.. అరగంట పాటు ఆలయంలోని సూర్యభగవానుడు, ఆంజనేయ స్వామీ విగ్రహాలపై అత్యంత ప్రకాశవంతంగా పడటంతో ప్రత్యేక కాంతీతో ధగధగలాడుతు బక్తులకి కనువిందు చేశారు.. తులా సంక్రాంతీ మాసం ప్రవేశించటంతో పంటలు చేతికి అందే సమయం వచ్చే వేళ ప్రతి ఏడాది తమ దేవాలయంలో మూలవిరాట్ ను సూర్యకిరణాలు తాకుతాయని ఆలయ నిర్వాహాకులు తెలుపుతున్నారు..180 ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ సూర్యదేవాలయం రాష్ట్రంలో నే అరుదైనా సూర్యదేవాలాల్లో రెండో పెద్ద దేవాలయం చిక్కవరం గ్రామములో ఉందని ప్రతి ఏడాది సూర్యడు దక్షిణాయనం, ఉత్తరాయణం లో ప్రవేశించే మాసాలలో ఈ ఆలయంలో స్వామీవారీ పై సూర్యకిరణాలు తాకుతాయని ఆలయ ధర్మకర్త వంశి తెలిపారు.















