దాదాపు 210 అడుగుల ఎత్తు ఉన్న రావణుడి బొమ్మను దసరా పండుగ సందర్భంగా శనివారం దహనం చేయనున్నారు.
హరియాణాలోని అంబాలాలో దసరా ఉత్సవాల్లో భాగంగా బరారా రామ్లీలా క్లబ్ దీన్ని ఏర్పాటు చేసింది.
1987 నుంచి ఏటా దసరా సందర్భంగా రావణుడి బొమ్మను తయారు చేసి దహనం చేస్తున్నారు.
ప్రారంభ సమయంలో 20 అడుగుల ఎత్తుతో తయారు చేయగా.. ప్రతి ఏడాదీ ఎత్తును పెంచుతూ వచ్చేవాళ్లు. అలా ఈ ఎత్తైన రావణుడి బొమ్మ ఇప్పటి వరకు ఐదు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకుందని క్లబ్ ఛైర్పర్సన్ తేజేందర్ చౌహాన్ తెలిపారు.
ఈ ఏడాది మాత్రం రావణుడి ఎత్తును మాత్రం పెంచలేదు.
బొమ్మ తయారీ ఖర్చు అధికంగా ఉండటంతో ఎత్తును పెంచలేకపోయినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ బొమ్మ తయారీకి ఇప్పటికే రూ.25లక్షలు ఖర్చు పెట్టారు.
రావణుడి చేతిలో 50 అడుగుల పొడవైన కత్తిని పెట్టారు.
రావణుడిని దహనం చేసేందుకు పర్యావరణానికి హాని చేయని పర్యావరణహిత టపాసులు ఉపయోగిస్తున్నారు.