వర్కింగ్ జర్నలిస్టులకు వారం రోజుల్లో ఆరోగ్య పరీక్షలు
బస్సు పాసులు రెన్యువల్ కు ఆదేశాలు
అర్హులందరికీ అక్రిడేషన్లు
ఫెడరేషన్ నేతలతో
జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్
విశాఖ జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులకు వారం రోజుల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు… సోమవారం జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి (ఎన్ ఏ జె )ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ ను ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో కలిసి పలు అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.. ఇటీవల కాలంలో పలువురు జర్నలిస్టులు ఖరీదైన వైద్య పరీక్షలు చేయించుకోలేకపోతున్నారని అలాగే మెరుగైన వైద్యం పొందలేకపోతున్నారని కలెక్టర్ కు వీరు వివరించారు ..దీంతో కలెక్టర్ సానుకూలంగా స్పందించి వారం రోజుల్లోనే జర్నలిస్టులకు ఆరోగ్య పరీక్షలు ప్రారంభించే విధంగా ఆదేశాలు జారీ చేశామన్నారు. అలాగే జర్నలిస్టుల బస్సు పాసుల గడువు ముగిసిన నేపథ్యంలో కొత్త అక్రిడేషన్లు జారీ అయ్యే వరకు మరో నెల రోజులు పాటు బస్సు పాసులు రెన్యువల్ కు ఆర్టీసీ అధికారులకు లేఖ రాయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. అలాగే అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్లు జారీ చేస్తామని కలెక్టర్ చెప్పారు.. కార్యక్రమంలో విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ. ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాసరావు బ్రాడ్ కాస్ట్ కార్యదర్శి కింతాడ మదన్ స్మాల్ అండ్ జాయింట్ సెక్రెటరీ మల్ల దేవా త్రినాధరావు మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చక్రి ..సంజీవ్.. రాజశేఖర్.














