అంబా శాంభవి చంద్రమౌళి రబలాపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ!
శారదా నవరాత్రులలో పదోనాడు ఇంద్రకీలాద్రి మీద కొలువై ఉన్న కనకదుర్గ రాజరాజేశ్వరిగా చిద్విలాసంగా సింహాసనారూఢయై కొలువు తీరుతుంది.
తొమ్మిదిరోజుల యుద్ధం తరవాత విజయోత్సవంలో ఉంటుంది. పరివారం.
అమ్మవారిని ఆనందంగా తిలకిస్తుంది. రాజులకి రాజులు అంటే… చక్రవర్తులకి అధీశ్వరి.
అందరి పైన అంటే…పద్నాలుగు లోకాలవారిపైనా ఆధిపత్యం కల తల్లి.
ఈ విధంగా ఉన్న తల్లినే అపరాజితాదేవి అని కూడా అంటారు.
వశిన్యాది వాగ్దేవతలు ‘శ్రీ మహా రాజ్ఞీ’ ‘శ్రీమత్సింహాసనేశ్వరీ’ అని కీర్తించింది ఈ రూపాన్నే.
ఈమె సకల బ్రహ్మాండభాండాలకూ ఆరాధ్యదేవత. త్రిపురాత్రయంలో మహాత్రిపురసుందరిగా పూజలందుకుంటూ ఉంటుంది.
కమలాసనాసీనయై చెరకుగడను ధరించి, అభయముద్రతో ఉంటుంది.