పర్యాటక కేంద్రాలు వెలవెల | కరోనా ప్రభావం | Agency | Visakhapatnam |Vizagvision..
పర్యాటక కేంద్రాలు వెలవెల
కరోనా ప్రభావం ఒక వైపు ఇటు వర్షాలు కురుస్తుండమే మరో వైపు కారణం నిరాశలో చిరు వ్యాపారులు
ఏజెన్సీ- పరిధిలో అరుకు, పాడేరు,జి.మాడుగుల, *బొర్రగుహాలు,,పద్మపురం అందాల అరకు లోయకు ఓ మోస్తరుగా పర్యాటకులు వచ్చారు దింతో సందర్శిత ప్రాంతాలైన మ్యూజియం పద్మపురం,, గార్డెన్ చాపరాయి,, లో సందడి వాతావరణం నెలకొంది దీనిలో భాగంగా పలువురి కుటుంబ సభ్యులతో యువత కూడా సెల్ఫీలు దిగుతూ ఏంజాయ్ చేశారు.చాపరాయిలో ప్రతి రోజు వర్షం కురుస్తుండడంతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది అయినప్పటికీ పర్యాటకులు లెక్కచేయకుండా నీటి ప్రవాహంలో జారుతూ కేరింతలు కొట్టారు.
( కొత్తపల్లి ) జలపాతం
జి.మాడుగుల,, మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొత్తపల్లి జలపాతంలో పర్యాటకులు జాడ కనిపించడం లేదు కరోనా తో సెలవు రోజు అయినప్పటికీ పదుల సంఖ్యలో మాత్ర మే జనం వచ్చారు దింతో జలపాతం బోసిపోయింది.పర్యాటక సీజన్ లేకపోయినా అంతంత మాత్రంగా పర్యాటకులు సందర్శిస్తుంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వంద లోపు మాత్రమే సందర్శించినట్లు జలపాతం నిర్వాహకులు అంటున్న మాటలు చిరు వ్యాపారుల సైతం నిరాశకు గురవుతున్నారు ప్రస్తుతం వర్షాలు ఇస్తుండడంతో దర్శకులు తగ్గుముఖం పట్టాయని పలువురు అభిప్రాయపడుతున్నారు
(చాపరాయికి) అంతంతమాత్రం
(డుంబ్రిగూడ) ప్రముఖ పర్యాటక కేంద్రం చాపరాయి
జలపాతానికి పర్యాటకులు అంతంతమాత్రంగానే విచ్చేశారు కరోనా,, ప్రభావంతో సెలవు రోజుల అయినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదని నిర్వాహకులు చెబుతున్నారు అయితే ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో తగ్గుముఖం పట్టిందని పలువురు భావిస్తున్నారు దీంతో పర్యాటకులు నమ్ముకుని వ్యాపారులు సాగిస్తున్న చిరు వ్యాపారుల నిరసన చెందారు.