దర్గా విషయంలో ఎక్కడో ఏదో కుట్ర జరుగుతుంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు అల్తాఫ్ రజా Vijayawada,Vizagvision
విజయవాడ వక్ఫ్ బోర్డు దర్గాల ఆస్తులు కాపాడండి గత ప్రభుత్వం చేసిన తప్పె ఈ ప్రభుత్వం కూడా అదే తప్పు చేస్తుంది – ముస్లిం పర్సనల్ లా బోర్డు అఫ్ ఇండియా
ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అల్తాఫ్ రజా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారు ఓట్లు వేయని వాళ్లు కూడా న్యాయం చేస్తానని మీరు చేస్తున్నటువంటి సందేశం చాలా బాగుంది కానీ ఓట్లు వేసిన వాళ్లకి న్యాయం చేయకపోవడం చాలా దారుణం
గత ప్రభుత్వ హయాంలో మీరు షేర్మిల గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చెప్పినటువంటి మాటలకు ఇవ్వాళ జరుగుతున్నటువంటి పరిణామానికి చాలా తేడా ఉంది వక్ఫ్ గజిట్లో ఉన్నటువంటి ఇ దర్గాలు వక్ఫ్ బోర్డు అధికారులు పట్టించుకోకుండా రక్షించాల్సిన అధికారులే నిర్లక్ష్యం చేయటం చాలా బాధాకరం
ఎంత దారుణంగా దర్గా గోపురం డ్యామేజీ అవ్వటమే కాకుండా పూర్తిగా లోయలోకి వెళ్లిపోవటం వర్షపు నీరు వచ్చినప్పుడు భయంకరంగా అది ఒక చెరువు లాగా అయ్యే ప్రమాదం ఉంది దర్గాకు ఆమడ దూరంలో ఉన్న దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పట్టించుకోక పోవటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
ఆ దర్గా విషయంలో ఎక్కడో ఏదో కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే అటు వక్ఫ్ బోర్డు అధికారులను పిలవకుండా ఇటు నష్టపరిహారం చెల్లించకుండా ఇష్టం వచ్చినట్టు ప్రహరీ గోడ నిర్మాణం చేసి చేతులు దులుపుకునె ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
ప్రహరీ గోడ నిర్మాణానికి ఎవరు అనుమతి ఇచ్చారు ?ఉప ముఖ్యమంత్రి మైనార్టీ వక్ఫ్ బోర్డు శాఖా మాత్యులు అంజాద్ గారికి ఎవరికీ తెలియకుండా ఎవరి అనుమతి తీసుకోకుండా ఎలా నిర్మాణం చేస్తారు ?
చుట్టుపక్కల ఉన్న వాళ్లందరికీ గజానికి లక్షల రూపాయలు చెల్లించి ఇక్కడ వందల గజాలు తీసుకుని మీ దగ్గర పట్టా ఉందా అని అడగటం అధికారులు అవగాహన లేకుండా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం .రాష్ట్ర వక్ఫ్ బోర్డు గజిట్ 1962 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గెజిట్లో ఉంటే సరిపోదా ? గోడ పగలు కొట్టినప్పుడు ఒక్కమాట — ఫ్లేవర్ నిర్మాణం చేసిన తర్వాత — ఇంకొక మాట మాట్లాడటం — ఇది ముస్లింలపై జరుగుతున్న కుట్ర కాదా ??
ఆనాడు కలెక్టర్ బాబు గారు ముస్లిం పెద్దలతో సమావేశం చేసినప్పుడు కోట్ల రూపాయల నష్టపరిహారం ఇస్తామని చెప్పింది నిజం కాదా ??
రెవెన్యూ అధికారులు ఈ స్థలం మాదేనని చెప్పడం హాస్యాస్పదం — ఐఏఎస్ అధికారి అజిత్ సింగ్ గారు దర్గాకు ఎ మాత్రం ఇబ్బంది లేకుండా ఆనాడు వ్యవహరించారు . వందల సంవత్సరాల చరిత్ర ఉన్న దర్గాకు అన్యాయం చేస్తే పుట్టగతులుండవని హెచ్చరిస్తున్నాం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పని మడమ తిప్పని మీ చరిత్ర హజరత్ సయ్యద్ షా ఖాద్రి అలి హుసేన్ షా ఖాద్రి దర్గా విషయంలో మాట తప్పితే ముస్లిం సమాజానికి ద్రోహం చేసినట్టేనని ఎందరో వేలాది మ౦ది హిందూ ముస్లిం ల భక్తుల మనోభావాలు దెబ్బ తీసినట్లే నని కాబట్టి భక్తుల మనోభాలను దృష్టి ఉంచుకుని ముఖ్యమంత్రిగారు ఈ విషయంలో స్పందించాలని వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం
ఆనాడు దర్గా విషయంలో న్యాయవాది మసూద్ అలీ జిన్నా హైకోర్టుని ఆశ్రయించారు
ముస్లిం పర్సనల్ లా బోర్డు అఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అల్తాఫ్ రజా
















