Survey of 94 Groups Foreign 725 Travelers From Different Regions in Seethamadhara in Visakhapatnam,Vizagvision….సీతమ్మధారలోని విదేశీ ప్రయాణీకులను 94 బృందాలు సర్వే
• 14 రోజులు హోం క్వారంటైన్ పూర్తి
• మరో రెండు వారాలు పాటు హోం క్వారంటైన్
సీతమ్మధార అర్బన్ తహసిల్థార్ జ్ఞానవేణి
సీతమధార అర్బన్ మండలంలో విదేశాలు, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 725 మంది ప్రయాణీకులను 94 బృందాలు సర్వే చేసినట్లు సీతమ్మధార అర్బన్ మండలం తహసిల్థార్ ఎ.జ్ఞానవేణి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయా ప్రయాణీకులు ను కరోనా వైరస్ వారి కుటుంబ సభ్యులకు మరియు ఇత ప్రజలకు వాప్తి చెందకుండా ఉండేందుకు హోం క్వారంటైన్ లో ఉన్న ప్రయాణీకుల ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వార్డ్ అడ్మిన్, గ్రామ రెవెన్యూ అధికారి, ఎ.ఎన్.ఎం. పోలీసు కానిస్టేబుల్, వాలంటీర్ సభ్యులుగా 94 బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 725 మంది ప్రయాణీకులలో 50 శాతం మంది 14 రోజులు హోం క్వారంటైన్ పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రజల్లోకి రాకుండా మరో రెండు వారాల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని వారికి తెలియజేసినట్లు చెప్పారు. ప్రయాణీకులందరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, వారిలో ఏవిధమైన కరోనా వైరస్ లక్షణాలు కనిపించలేదని వివరించారు. 94 బృందాలు ప్రతీ రోజు క్వారంటైన్ లో ఉన్న వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం గూర్చి తెలుసుకొని తగు చర్యల నిమిత్తం తహసిల్థార్ కార్యాలయంనకు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. సర్వేలో ఇంత వరకు ఏ విధమైన కరోనా పాజిటివ్ కేసులు రాలేదని చెప్పారు
















