Rythu Bazars Rush తీరు మారని ప్రజలు కిటకిటలాడుతున్న రైతు బజార్లు,Vijayawada,Nandigram & Visakhapatnam,Vizagvision…కరుణ మహమ్మారి నుండి స్వీయ రక్షణ అవసరమని ప్రభుత్వం అనేక రకాలుగా ప్రజలను అవగాహన పరిచిన ప్పటికీ ప్రజలలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. కేవలం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు నిత్యవసర అత్యవసర దుకాణాలు తెరిచి ఉంటాయన్న నిబంధన దృష్ట్యా రైతు బజార్ లకు మరియు పచారీ దుకాణాలకు జనాలు పోటెత్తారు. మరీ ముఖ్యంగా రైతు బజార్లు ఇసుక వేస్తే రాలని పరిస్థితి ఏర్పడింది. ఉదయాన్నే కూరగాయల కోసం కొనుగోలుదారులు రైతు బజార్ల కౌంటర్ల వద్ద నిలుచున్నారు. కానీ ఎవరి వద్ద మార్కులు గాని మరే ఇతర రక్షణ కవచాలు గాని కనిపించడం లేదు.ఇటు దుకాణ యజమానులు సైతం మాస్కులు లేకుండా రక్షణ కవచాలు లేకుండా కూరగాయలు విక్రయిస్తున్నారు.ప్రభుత్వాలు అనేక ప్రచార సాధనాల ద్వారా కరోనా వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు పదేపదే చెబుతున్నప్పటికీ ప్రజలు పెడచెవిన పెడుతున్నారు. వారి ఇష్టానుసారంగా గుంపులు గుంపులుగా ఒకచోట చేరకూడదని అలాంటి ప్రదేశాలలో కరుణ మహమ్మారి విజృంభిస్తుంది అని తెలిసినప్పటికీ ఏమాత్రం బాధ్యత లేని విధంగా ప్రజలు మరియు దుకాణదారులు ప్రవర్తిస్తున్నారు. ఇదే అవకాశంగా రైతు బజారు దుకాణాలలో ధరలు సైతం బోర్డు రేటు కంటే పెంచి అమ్ముతున్నారు. ప్రజలందరూ మూకుమ్మడిగా ఒకేసారి రావడం ప్రభుత్వం ఇచ్చిన సమయం తక్కువగా ఉండటంతో చేసేది లేక అధిక రేట్లకు కొనుగోలుదారులు కొనుగోలు చేస్తున్నారు.















