AP CM Jagan Orders Elections to Local Bodies Should be Completed Within a Month Amaravathi,Vizagvision…స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం సమీక్ష
నెలరోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిచేయాలి: సీఎం
హైకోర్టు కూడా ఇదే విషయం చెప్పింది: సీఎం
ఈ నెలాఖరులోగా ఎంపీటీసీ, జెట్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు: సీఎం
పంచాయతీరాజ్ చట్టంలో సవరణలకోసం ఆర్డినెన్స్ తీసుకువచ్చాం: సీఎం
డబ్బులు, లిక్కర్లను పూర్తిగా నిరోధించాలన్న దృక్పథంతో ఆర్డినెన్స్ తెచ్చాం:సీఎం
పోలీస్‌యంత్రాంగం చాలా దృఢంగా పనిచేయాలి, దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకోవాలి: సీఎం
డబ్బులు పంచుతూ, ఎన్నికల తర్వాత కూడా నిర్ధారణ అయితే అనర్హత వేటు విధిస్తాం, మూడేళ్లపాటు జైలు శిక్ష పడుతుంది: సీఎం
జిల్లా ఎస్పీలు డబ్బులను, మద్యాన్ని అరికట్టాలి:
ప్రతి గ్రామంలో ఉన్న పోలీస్ మిత్రలను, గ్రామంలో మహిళా పోలీసును పూర్తిస్థాయిలో వినియోగించాలి:
ఎక్కడా డబ్బు పంపిణీచేశారన్న మాట రాకూడదు :
ఎన్నికల్లో లిక్కర్ పంచారన్న మాట రాకూడదు:
ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారి వచ్చి కోట్లుకోట్లు వెదజల్లి ఎన్నికల్లో గెలవడంకాదు, ఊరిలో ప్రజలందరికీ అందుబాటులో ఉండి వారికి సేవచేసే
వ్యక్తులు ఎన్నిక కావాలి, అందుకే కోసమే ఈ మార్పులు తీసుకు వచ్చాం:
మన రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ దేశానికి ఆదర్శం కావాలి:
సాధారణ ఎన్నికల ఎన్నికల అక్రమాలు, ఉల్లంఘనల నిరోధానికి యాప్ ఉపయోగించిన మాదిరిగానే స్థానిక సంస్థల ఉన్నికలకు కూడా ఒక యాప్ అందుబాటులో ఉంచాలి:
ఎన్నికల అధికారులకు, పోలీసు అధికారులకు ఈ డేటా చేరాలి:
గ్రామాల్లో ఉండే పోలీసు మిత్రులు, గ్రామ సచివాలయంలో ఉండే మహిళా మిత్రులు, గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగుల వద్ద, ప్రజల వద్ద ఈయాప్ ఉండాలి:
ఏం జరిగినా వెంటనే ఈ యాప్‌లో నమోదు కావాలి:
ఎవరైనా తప్పులు చేస్తే అనర్హత వేటు వేయాలి, జైలుకు పంపాలి















