ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ప్రతిష్టాత్మక ఇటాలియన్ గోల్డెన్ సాండ్ ఆర్ట్ అవార్డు 2019కు ఎంపికయ్యారు.
ఇటలీలో నిర్వహించనున్న అంతర్జాతీయ సాండ్ నేటివిటీ కార్యక్రమంలో సుదర్శన్ ఈ పురస్కారం అందుకోనున్నారు.
నవంబరు 13 నుంచి 18 వరకు ఈ వేడుక జరగనుంది.
ఎనిమిది మంది శిల్పులు పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో పట్నాయక్ భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈ అవార్డుకు ఎంపికైనందుకు చాలా ఆనందంగా ఉందని పట్నాయక్ తెలిపారు.















