Pradhan Yojana Scheme Awareness by Indostar Home Finance Pvt Ltd in Visakhapatnam,Vizagvision…కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా అమల్లోకి తీసుకువచ్చిన ప్రధాన్ యోజన పథకంపై విశాఖలో ఇండోస్టార్ హోమ్ ఫైనాన్స్ ప్రయివేట్ లిమిటెడ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దింట్లో భాగంగా విశాఖలో అన్ని వర్గాల ప్రజలు,వ్యాపార ప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 200 మంది పాల్గొని ప్రధాన్ యోజన పథకంపై అవగాహన పెంచుకున్నారు.ముక్యంగా ప్రధాన్ యోజన పథకం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయన్న అంశంపై ఇండోస్టార్ హోమ్ ఫైనాన్స్ ప్రయివేట్ లిమిటెడ్ ప్రతినిధులు వివరించారు. కులమత,పేద ధనిక వర్గాల తారతమ్యం లేకుండా ఈ పధకం వర్తిస్తుందని రెండు తెలుగు రాష్ట్రాల హెడ్ స్వరూప్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో విశాఖ శాఖ బ్రాంచ్ మేనేజర్ వెంకట్,ఏరియా మేనేజర్ కుమార్ శేఖర్,విజయనగరం, శ్రీకాకుళం బ్రాంచ్ మేనేజర్ హరీష్,రాజమండ్రి బ్రాంచ్ మేనేజర్ ముఖేష్,హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ శాఖ బ్రాంచ్ మేనేజర్ వెంకట్ బ్రాంచ్ ప్రతినిధులకు జ్ఞాపకాలను అందచేశారు.














