Kanchi Pattu saree opened in South Central Shopping Mall by Anchor Anasuya in Payakaraopeta,Vizagvision..పాయకరావుపేట మెయిన్ రోడ్ లో సౌత్ సెంట్రల్ షాపింగ్ మాల్ నందు ఏర్పాటుచేసిన కంచిపట్టు మందిరం శనివారం ప్రారంభించారు. ప్రముఖ నటి , యాంకర్ అనసూయ హాజరై మాల్ రెండవ బ్లాక్‌లో నందు కంచిపట్టు కలెక్షన్స్‌ను జ్యోతి ప్రజ్వలన చేసి ఆరంభించారు. అనసూయ మాట్లాడుతూ పాయకరావుపేట నగరంలోని ప్రజలకు సౌత్ సెంట్రల్ షాపింగ్‌మాల్‌ను అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు. ఆధునిక హంగుల పోకడల ఫ్యాషన్ దస్తులు, సంప్రదాయ దుస్తులతో పాటు ఆధునిక డిజైన్ల కంచిపట్టు చీరలు మాల్లో లభ్యమవుతాయన్నారు. సౌత్ సెంట్రల్ షాపింగ్ మాల్ అధినేత మామిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముప్పయి సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో అతి పెద్ద షాపింగ్ మాల్‌ను ఏర్పాటుచేశామన్నారు.
కంచిపట్టు మందిరం ప్రారంభోత్సవానికి విచ్చేసిన యాంకర్ అనసూయ నగరంలో సందడి చేశారు. అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ ‘ఐ లవ్యూ పాయకరావుపేట’ అంటూ అభిమానులను ఉత్సాహపరిచారు. అనసూయను చూసేందుకు అభిమానులు సౌత్ సెంట్రల్ షాపింగ్ మాల్ వద్ద గుమిగూడారు. సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.