శాసన సభలో 2019-20 ఓటాన్ అకౌంట్ బడ్జెట్.
ప్రవేశ పెట్టిన ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు
శాసనసభలో బడ్జెట్ పై ఆర్ధికమంత్రి యనమల ప్రసంగం
11వ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం నాకు గర్వకారణం: ఆర్ధికమంత్రి యనమల
చారిత్రాత్మకమైన రాజధాని నగరం ‘మన అమరావతి’.
ఈ అమరావతిలో వరుసగా 3వబడ్జెట్ పెట్డడం గర్వకారణం
నాలుగున్నరేళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం
సవాళ్లను అధిగమించిన తీరు గుర్తు చేసుకుందాం.
హేతుబద్దత లేకుండా రాష్ట్రవిభజన జరిగింది
దీనివల్ల రాజధాని నగరాన్ని కోల్పోయాం
ఆదాయ-వ్యయాలను సరిగా పంచలేదు.
ఆస్తులు-అప్పులను సరిగా పంపిణీ చేయలేదు
దీనితో రాష్ట్రవ్యాప్తంగా నిరాశా నిస్పృహలు
అపార అనుభవం గల నాయకత్వాన్ని ప్రజలు ఆశించారు
ఆ నమ్మకంతోనే శ్రీ చంద్రబాబుకు అధికారం అప్పగించారు.
ప్రజలంతా తమ నమ్మకాన్ని,ఆశలను ఉంచారు.
నాలుగున్నరేళ్ల పురోగతిని సమీక్షించుకుందాం: అసెంబ్లీలో యనమల
గతంలో ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకుందాం
రాష్ట్ర ఆర్ధిక మనుగడపై అప్పట్లో భయాందోళనలు
ఉద్యోగుల జీతాలను చెల్లించలేమనే అనుమానాలు
ఇంత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఊహించామా..?
వరుసగా రెండంకెల వృద్ధి సాధిస్తుందని ఊహించామా..?
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ముందంజ అంచనా వేశామా..?
పెట్టుబడుల ఆకర్షణలో ముందంజ అంచనావేశామా..?
అంతర్జాతీయ నగరంగా అమరావతిని నిర్మిస్తామని కలగన్నామా..?
28,074మంది రైతులు భూములు ఇస్తారని ఊహించామా..?
భూముల సమీకరణ విజయవంతం అవుతుందని ఊహించారా..?
రాజధానికి 2,28,559మంది విరాళాలు ఇస్తారని ఊహించామా..?
పోలవరం డ్యామ్ శరవేగంగా జరుగుతుందని అనుకున్నామా..?
అతిపెద్ద ప్రాజెక్టులలో పోలవరం ఒకటి అవుతుందని ఊహించామా..?
నదుల అనుసందానంలో ఏపి మార్గదర్శకం అవుతుందని అనుకున్నారా..?
3ప్రాంతాలలో 3అంతర్జాతీయ విమానాశ్రయాల అభివృద్ధి కలగన్నారా..?
ఇంత త్వరగా మన గడ్డపైనే మన పాలన అనుకున్నామా..?
తీవ్ర ఆర్ధికలోటులో ఇంత పెద్దఎత్తున సంక్షేమం ఊహించారా..?
రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తామని అనుకున్నారా..?
పించన్లు 10రెట్లు చేస్తామని ఊహించామా..?
మహిళలకు ‘పసుపు-కుంకుమ’ ఇస్తామని అనుకున్నారా..?
గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కలగన్నారా..?
దేశానికే మార్గదర్శక నమూనా ఇస్తామని ఊహించారా..?
అవన్నీ ఈ రోజున సాధించాము. అందరి కలలు నిజం చేశాము
ఎన్నో ప్రతికూలతల నడుమ ఈ విజయాలు గర్వకారణం
ఈ మంత్రిమండలిలో సభ్యుడు కావడం గర్వకారణం
ప్రజలిచ్చిన బాధ్యత చంద్రబాబు భుజాన వేసుకున్నారు.
వినమ్రతతతో,అంకితభావంతో పనిచేశారు.
సమాజ వికాసం,కుటుంబ వికాసం,సుస్థిర వృద్ధి లక్ష్యాలు
ఆర్ధిక అసమానతలపై పూర్తి జాగురూకతతో ఉన్నాం
సమ్మిళిత అభివృద్ధి, అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యం
తల్లి గర్భంలో నుంచి జీవితాంతం వరకు సంక్షేమం.
ప్రతి జీవన దశలో పేదలకు సంక్షేమం
మా ప్రభుత్వ విధానాలు, చర్యలతో సత్ఫలితాలు
అన్నిరంగాలలో వేగవంతమైన అభివృద్ధి
పురుషులతో మహిళలు పోటీపడే సమాజం ఏర్పాటే మా లక్ష్యం
మహిళా సాధికారత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష.
20ఏళ్ల క్రితమే మహిళా పొదుపు సంఘాల ఏర్పాటు
‘వెలుగు’ ప్రపంచంలోనే అతిపెద్ద పేదరిక నిర్మూలనా కార్యక్రమం
ఈరోజు 94లక్షల మంది మహిళలు అందులో ఉన్నారు
అందులో 17లక్షల మంది ఎస్సీలు, 5లక్షలు ఎస్టీలు,
46లక్షలు బీసిలు,5లక్షలు మైనారిటీలు, 21లక్షలు జనరల్ కేటగిరి
2014కు ముందు మహిళా సంఘాలపై తీవ్ర ఆర్ధిక ఒత్తిడి
‘పసుపు-కుంకుమ’ తొలిదశలో రూ.8,604కోట్లు ఇచ్చాం
ప్రతి మహిళకు రూ.10,000 ఇచ్చాం.
‘అన్న’గా ఆడపడుచుల బాధ్యత చంద్రబాబు భుజాన
ఇప్పుడు మళ్లీ ఒక్కో మహిళకు మరో రూ.10వేలు
ఫిబ్రవరిలో రూ.2,500, మార్చిలో రూ.3,500, ఏప్రిల్ లో రూ.4,000 ఇస్తాం
93.81లక్షల మందికి రూ.9,381కోట్లు లబ్ది
20,50,794మంది మహిళలకు రూ.63,283కోట్ల బ్యాంకు లింకేజి
స్త్రీనిధి లబ్దిదారుల సంఖ్య రెట్టింపు చేశాం. స్త్రీనిధి రుణాల మొత్తాన్ని 5రెట్లు పెంచాం.
మహిళలకు వడ్డీలేని రుణాలు రూ.2,514కోట్లు ఇచ్చాం.
ఒప్పంద ఉద్యోగులు, పొరుగు సేవల సిబ్బందికి 180రోజుల ప్రసూతి సెలవులు
1.87లక్షల మంది బాలికలకు సైకిళ్లు ఇచ్చాం.
తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్ తో 7.19లక్షల మహిళలకు లబ్ది
6.91లక్షల మంది తల్లులకు ఎన్టీఆర్ బేబి కిట్స్
2019-20 బడ్జెట్ అంచనా : రూ.2,26,177.53కోట్లు( గత ఏడాది కన్నా 18.38% పెరుగుదల)
రెవిన్యూ వ్యయం : రూ.1,80,369. 33కోట్లు( 20.03% పెంపు)
కేపిటల్ వ్యయం : రూ.29,596.33కోట్లు( 20.03% పెంపు)
రెవిన్యూ మిగులు : రూ.2099.47కోట్లు (అంచనా)
ఆర్ధిక లోటు : 32,390. 68కోట్లు(అంచనా)