నిరంతరం శ్రమిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న జర్నలిస్టులకు పెందుర్తి ఉన్నత పాఠశాలలో రైజింగ్ టైగర్స్ బాక్సింగ్ అసోషియేషన్ అధ్యక్షులు రామ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పెందుర్తి సీఐ వెంకి నాయుడు, ఏసై జి డి బాబు, లయోలా వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు ప్రకాష్ రావు, పెందుర్తి కళాశాల ప్రిన్సిపాల్ విజయ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాయుడు, బీసీ హాస్టల్ వార్డెన్ నాయుడు న్యాయవాది తులసీరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాత్రనక పగలనక పనిచేస్తున్న విలేఖరులను గుర్తించి వారికి సన్మానం చేయడం చాల ఆనందంగా ఉందని, ఈ సన్మానంతో వారి బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. అలాగే ఇంతమంది జర్నలిస్టులకు సన్మానం చేయడం మొదటిసారిగా చూస్తున్నామని ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం చాల ఆనందంగా ఉందని అన్నారు. అలాగే ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు ప్రత్యేక పథకాన్ని ఏర్పాటుచేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. సమాజంలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండి లాభం ఆశించకుండా పనిచేస్తున్న వారి కృషి అబినందనీయమని అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు వెంకట సూరి ఆంధ్రజ్యోతి, పండా సూర్యప్రకాష్ మెట్రో టీవీ, వాల్మీకి నాగరాజు వాల్మీకి న్యూస్, ప్రసాద్ సాక్షి, నర్సింగ్ tv9, రవి 99, ఈశ్వరరావు యాక్ట్, శేషు tv5, ఆనంద్ మోజో టీవీ, మూర్తి i న్యూస్, లక్ష్మణ్ భారత్ టు డే, సిమ్మ వాజీ టీవీ, ప్రసాద్ svbc, గంటా ప్రసాద్ ఆంధ్రభూమి, ఈశ్వరరావు తేజ టైమ్స్, కిషోర్ ప్రజాశక్తి, గోపి పీజే న్యూస్, కృష్ణం రాజు దిక్షుచి టైమ్స్, రాజకమల్ 4 hd న్యూస్, చక్రపాణి గ్రేటర్ న్యూస్ అవినాష్ న్యూస్9, నేతాజీ తేజ టైమ్స్, తదితరులు పాల్గొన్నారు.














