YCP MP Vijayasaray Reddy Criticizes to Election Commissioner’s Postpont in Visakhapatnam,Vizagision..
తెదేపాను కాపాడడానికే ఎన్నికల వాయిదా నిర్ణయం ఎన్నికల కమిషనర్ తీసుకున్నారని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. శునకాన్ని తీసుకొచ్చి సింహాసనంపై కూర్చోబెట్టారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అధికారులతో సంప్రదించకుండా ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారంటూ ప్రశ్నించారు.
స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలన్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయాన్ని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన పేరు నిమ్మగడ్డ రమేష్ కాదు నారా రమేష్ అని అన్నారు. శునకాన్ని రాష్ట్ర అధికారులతో సంప్రదించకుండా రమేష్ ఎన్నికలను ఎలా వాయిదా వేస్తారని ప్రశ్నించిన విజయసాయిరెడ్డి. మునిగిపోతున్న తెదేపా నావను కాపాడడానికే ప్రక్రియ వాయిదా వేశారని విమర్శించారు. 243కె, 243 జడ్ ఏ ఆర్టికల్‌ను తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. రమేష్ కుమార్ ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించారన్నారు. నైతికత ఉంటే ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
















