ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఆదివాసి మహాజాతర మేడారం శ్రీ సమ్మక్క సారక్క జాతర ఫిబ్రవరి 5, 6, 7 తేదీలలో జరిగే జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండ దేశ నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకొనుటకు వస్తున్నారు.
తెలంగాణా మహా జాతరకు సర్వం సిద్ధం
జాతరకు రూ. 75 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
ప్రత్యేక బస్సులు, రైళ్ల ఏర్పాటు
ములుగు జిల్లా మేడారం లో ప్రతి రెండేళ్ళకుఒకసారి జరిగే సమ్మక్క, సారలమ్మ జాతర ఆసియా లోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్దినొందింది,. తాడ్వాయి మండలం లోని కీకారణ్యం గుండా సాగే దారిలో వున్న మేడారం లో ప్రతి రెండేళ్లకు ఒకేసారి మాఘశుద్ధ్య పాడ్యమి రోజు ప్రారంభ మయ్యే ఈ అతిపెద్ద గిరిజన జాతరకు దాదాయపు కోటి మంది కి పైగా భక్తులు హాజరవుతారు. పూర్తిగా కోయ గిరిజన సాంప్రదాయం లో జరిగే ఈ జాతరలో సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు ఏ విధమైన విగ్రహాలు గాని, ప్రతిరూపాలుగాని వుండవు. మేడారం జాతర కాశీ పుష్కర మేళాలకు, పూరీ జగన్నాధ రథయాత్రకు, తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలకు భిన్నమైన రీతిలో జరుగుతుంది. ఈ జాతరకు వచ్చే భక్తులు పసుపు, కుంకుమ, బెల్లం లాంటి వస్తువులతో అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తారు. తెలంగాణా కుంభమేళా గా పిలిచే ఈ మేడారం జాతరకు ఆంద్రప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఒరిస్సా, మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలలోని గిరిజనులు, గిరిజనేతరులే కాకుండా విదేశీ భక్తులు కూడా వస్తారు.గిరిజన కుంభ మేళా గా పేరుగాంచిన మేడారం జాతరకు గాను హాజరయ్యే దాదాపు కోటిన్నర మంది భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండావుండేందుకు గాను కేసీఆర్ నేతృత్వం లోని రాష్ట్ర ప్రభుత్వం రూ 75 కోట్లను ప్రత్యేకంగా మంజూరు చేసి విస్తృత ఏర్పాట్లను చేపట్టింది। అదనపు స్నాన ఘట్టాల ఏర్పాటు, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం, అంతర్గత రోడ్ల నిర్మాణం, పారిశుధ్య కార్యక్రమాలు, నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాల కల్పన, విస్తృత బందోబస్తు,రవాణా సౌకర్యం తదితర ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు।వివిధ శాఖలు చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు..
రోడ్లు, భవనాల శాఖ:
మేడారానికి వెళ్లే రహదారుల నిర్మాణం, మరమత్తులు, నూతన రోడ్ల నిర్మానికిగాను రూ . లక్షల రూపాలను కేటారించారు. దీనితో ప్రస్తుతం ఉన్న బీటీ రోడ్లకు ప్యాచ్ వర్కులు, నూతన రోడ్ల నిర్మాణాలతో పాటు మేడారం లో నూతన గెస్ట్ హౌస్ నిర్మాణాన్ని రోడ్లు, భవనాల శాఖ చేపట్టి పనులన్నింటినీ పూర్తి చేశారు। దాదాపు 25 పనులను చేపట్టి రోడ్డు భద్రతా నిబంధనలనలు పరిగణలో తీసుకొని పనులను చేపట్టారు।
నీటిపారుదల శాఖ:
మేడారం సందర్శించే లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు నీటిపారుదల శాఖ విస్తృత ఏర్పాట్లను చేపట్టింది. మూడున్నర కిలోమీటర్ల పొడవునా ఉన్న జంపన్న వాగులో ఉన్న ప్రస్తుత స్నానఘట్టాలకు మరమ్మతులు, కొత్త స్నాన ఘట్టాల నిర్మాణం, జంపన్న వాగు లో స్నానాలను ఆచరించేందుకై నీటి మట్టాలను సరిపడా ఉంచేందుకై క్రాస్ బండ్ల నిర్మాణం, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గాను 132 ప్రత్యేక కంపార్టుమెంట్ల నిర్మాణం తదితర పనులను నాలుగు కోట్ల రూపాయలతో నీటిపారుదల శాఖ చేపట్టింది.
గిరిజన సంక్షేమ శాఖ:
మేడారం తో పాటు మేడారానికి దారి తీసే గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను నాలుగు కోట్ల రూపాయల వ్యయం తో గిరిజన సంక్షేమ శాఖ చేపట్టింది. ప్రస్తుతం ఉన్న గిరిజన సంక్షేమ శాఖ క్రింద ఉన్నరోడ్లను పటిష్టం చేయడం, ప్రముఖుల వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, ఆశ్రమ పాఠశాలలకు మరమ్మతులు, శాఖ క్రింద ఉన్న విశ్రాంతి భవనాలలో సౌకర్యాలు కల్పించడం, జాతరలో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి వసతి కల్పించడం తదితర పనులను చేపట్టారు. దీనికి తోడూ ఈ సారి జాతరకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా రూ 6,35 కోట్లను మూడు శాశ్వత షెడ్ ల నిర్మాణానికి నిధులను మంజూరు చేసింది. జంపన్న వాగులో ఐదు ఇన్ఫిల్టరేషన్ బావుల తవ్వకం, మేడారం పరిసర ప్రాంతాల్లో 229 సోలార్ లైట్ల ను ఏర్పాటు చేసేందుకు కూడా ఈ నిధులను ఉపయోగిస్తున్నారు.
గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం:
జాతరకు వచ్చే కోటి మందికి పైగా జనాలకు కనీససౌకర్యాలైన తాగునీరు, టాయిలెట్లు, భూగర్భ మంచినీటి ట్యాంకుల నిర్మాణం చేపట్టేందుకై ఆర్దబ్ల్యూఎస్ విభాగానికి ప్రభుత్వం పన్నెండు కోట్ల రూపాయలను కేటాయించింది। ఈ నిధులతో 8400 తాత్కాలిక మరుగు దొడ్లు, 538 బ్యాటరీ ఆఫ్ ట్యాపులు, 44 ఇంఫిల్టరేట్ బావుల తవ్వకం, ఒక దారిటరీ భావన నిర్మాణాన్ని గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం చేపట్టి దాదాపు అన్నింటినీ పూర్తిచేశారు.
పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ:
పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా ప్రస్తుతం ఉన్న తొమ్మది రహదారుల విస్తరణ, మరమ్మతుల నిర్వహణ కు మూడున్నర కోట్లను కేటాయించింది.
పంచాయితీ రాజ్ పారిశుధ్య విభాగం:
పంచాయితీ రాజ్ పారిశుధ్య విభాగం ద్వారా పలు పనులను చేపట్టేందుకై రూ 366 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
ఈ నిధులతో ప్రధానంగా నాలుగు డంపింగ్ యార్డుల నిర్మాణం, 300 మినీ డంపింగ్ యార్డుల నిర్మాణం, చెత్త తరలింపుకై 3450 మంది పారిశుధ్య కార్మికులను ప్రత్యేకంగా రప్పించారు, జాతర ముందు, జాతర అనంతరం మేడారం లో పారిశుధ్య పనులు నిర్వహించి ఏవిధమైన పరిశుభ్రం లేకుండా ఉండేవిధంగా చర్యలు పేపట్టారు।
















