ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి లోనే ఉండాలని రాజధాని రైతులు, రైతు కూలీలు, ప్రజలు, మహిళలు చేస్తున్న నిరసనధీక్షలలో భాగంగా ఈరోజు ఉదయం నుండి యర్రబాలేం గ్రామంలో రాజశ్యమల పవిత్ర యజ్ఞం కార్యక్రమం నిర్వహించారు.
ఈకార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ ఛైర్మన్ టిడిపి ఇన్చార్జి గంజి చిరంజీవి గారు
ఈసందర్భంగా చిరంజీవి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మనసు మారాలని ప్రజలు చేస్తున్న ఈ యజ్ఞం చేయడం చాలమంచి పరిణామం అని అలాగే చర్చల్లో మసిదులలో కూడ ప్రార్దనలు చేస్తామని తెలిపారు.
ఎప్పటినుంచో అభివృద్ధి లో ఉన్న విశాఖపట్నం కన్నా అమరావతి రాజధాని చాల వెనుకబడిన ప్రదేశం అని రాష్ట్ర నడిబొడ్డున ఉంన్న ప్రాంతమని ఇక్కడే రాజధాని ఉంచాలని తెలిపారు. ఈకార్యక్రమంలో ఆకుల జయసత్యగారు రైతులు పాల్గొన్నారు

















