మంగళగిరి జనసేన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రజలకు ఆయన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మాట్లాడుతూ.. భారతదేశం నుంచి పాకిస్తాన్ మత ప్రాదికన విడిపోయిందన్నారు.
భారతదేశం హిందుత్వ దేశంగా కాకుండా సర్వమత సమ్మేళనానికి నాందీగా నిలిచిందన్నారు.
జెండాకు వందనం చేయడం కాదని.. మన పూర్వీకుల త్యాగాలను అర్ధం చేసుకోవాలన్నారు.
మనం కూడా త్యాగాలకు సిద్దంగా ఉండి.. భవిష్యత్తు తరాల కోసం పోరాడాలని పవన్ కల్యాణ్ పిలుపు ఇచ్చారు.
హిందూయిజం అనేది మతం కాదని.. భారతీయమని అన్నారు.
ఎక్కడ అన్యాయం జరిగినా కులం, మతం చూడకుండా ప్రశ్నించాలన్నారు.
మన దేశం ఔన్నత్యాన్ని గుర్తించి.. సమాజానికి మంచి చేయాలన్నారు.
దేశ పౌరులందరూ బాధ్యతతో మెలగాలని కోరుతున్నామని పవన్ వ్యాఖ్యానించారు.

















