ప్రభుత్వ కళాశాలలో అమ్మ ఒడి పథకం ఆవిష్కరణ సభలో సీఎం జగన్ చిత్తూరు,Vizagvision…
పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాలలో అమ్మ ఒడి పథకం ఆవిష్కరణ సభలో సీఎం జగన్ కామెంట్స్
చిన్నారులకు, వాళ్ళ తల్లులకు అమ్మ ఒడి అంకితం
పాదయాత్ర సమయంలో పిల్లల చదువుల కోసం తల్లుల తాపత్రయం చూశాను
పేదింటి పిల్లలకు…తల్లులకు అభ్యున్నతి కోసమే ఈ పథకం
43 లక్షల మంది తల్లులు… 82లక్షల మంది పిల్లలకు ఈ పథకం ద్వారా లబ్ది
అర్హులైన ప్రతి తల్లికి నేరుగా 15వేలు బ్యాంక్ అకౌంట్ లో వేస్తున్నాం
బ్యాంక్ లో పాత అప్పు ఉన్నా ఈ డబ్బు మినహించుకోకుండా బ్యాంకర్లతో మాట్లాడాం
6318కోట్ల రూపాయలు ఈ రోజు అర్హులైన తల్లులు బ్యాంక్ అక్కౌంట్ల లో పడనున్నాయి
ఈ ఏడాది సమయం ఇద్దామని 75 శాతం అటెండేన్స్ షరతు మినహాయించాము
వచ్చే ఏడాది నుంచి 75శాతం హాజరు తప్పని సరి
ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం దిశగా అడుగేస్తున్నాం
ఆంగ్ల మాధ్యమం పై ప్రజల ఆకాంక్ష చంద్రబాబుకు, సినిమా యాక్టర్ కి వినిపించడం లేదు
ఒక్కో తరగతి లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెడుతూ…నాలుగేళ్లలో పూర్తి స్థాయిలో అమలు చేస్తాం
తెలుగు మీడియం పిల్లలకి కొన్ని ఇబ్బందులు వస్తాయి
వాటిని అధిగమించేలా బ్రిడ్జ్ కోర్సులు తీసుకుని వస్తాము
తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్ చేస్తున్నాం
ఉపాధ్యాయుల ఆంగ్ల బోధన కోసం శిక్షణా కోర్సులు పెడతాం.
2040నాటికి మన పిల్లలు ప్రపంచలో ఎక్కడికైనా పోటీకి వస్తారు
ప్రభుత్వబడుల్లో సిలబస్ మారుస్తున్నాం
పిల్లలకు పెట్టె మధ్యాహ్న భోజన సమయంలో పెట్టె మెనూ రోజూ మార్పు.. మెనూ మార్పు ద్వారా 200 కోట్లు అదనపు భారమైన భరిస్తాము
దేశం చరిత్రలోనే పిల్లలు చదువుకోసం ఇంతటి ప్రాధాన్యత ఎవ్వరు ఇవ్వలేదు
మధ్యాహ్నం భోజనం పెట్టె ఆయాలు జీతాలు మూడు వేలకు పెంపు.. దీని ద్వారా 160 కోట్లు అదనపు భారం పడుతున్న చిరునవ్వుతో స్వాగతిస్తున్నా
















