జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ కాలనీలో భూమి పూజ పది లక్షలతో కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్మే,Vizagnagram,Vizagvision… పట్టణంలోని ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలో గల జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ కాలనీలో అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి భూమి పూజ నిర్వహించారు. సమాజాభివృద్ధికి ప్రభుత్వంతో పాటు పాటుబడుతున్న జర్నలిస్ట్ ల కాలనీకి మౌళిక సదుపాయాలు కల్పించాలన్న విజ్ఞప్తితో తాము ముందుకొచ్చామని ఎమ్మెల్యే వీరభద్రస్వామి స్పష్టం చేశారు. 9.75 లక్షలతో తొలుత కల్వర్టు నిర్మిస్తున్నట్టు తెలిపారు. త్వరలో తాగు నీరు, విద్యుత్తు తదితర కనీస సదుపాయాలు కల్పిస్తామన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరులో మంత్రి బొత్స సత్యన్నారాయణ ప్రోత్సాహంతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంజూరు చేశారని స్పష్టం చేశారు. కాలనీ అభివృద్ధికి శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ చూపించిన చొరవకు జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు బూరాడ శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. అప్పటి ఎం.పి బొత్స ఝాన్సీలక్ష్మి మట్టి రోడ్లు వేయించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తొలుత శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి భూమి పూజ నిర్వహించారు. సొసైటీ ప్రతినిధులు కె.శేఖర్, మజ్జి వాసుదేవరావు, కె.జె.శర్మ, రమేష్ నాయుడు, జి.గోపాల్, అప్పారావులు స్వాగతం పలికారు. కార్యక్రమ ఏర్పాట్లను భళ్లమూడి నాగేంద్రప్రసాద్, చందక దుర్గాప్రసాద్, జి.వి.ఎస్.ఆర్.మూర్తి నిర్వహించారు. ఎమ్మెల్యే కోలగట్ల ను అధ్యక్షులు బూరాడ శ్రీనివాసరావు, సభ్యులు లింగాల నరసింగరావు, దాలిరాజు, బాబా, కిషోర్, మజ్జి శివ, సంతోష్, రవి, కామేశ్వరరావు తదితర సభ్యులు సముచిత రీతిన సత్కరించారు.
















