అమరావతి ఉద్యమానికి విరాళాల సేకరణ కోసం చంద్రబాబు నాయుడు నేతలు జోలె పట్టారుమచిలీపట్నం,Vizagvision…
అమరావతి ఉద్యమానికి విరాళాల సేకరణ కోసం మచిలీపట్నంలో నేతలు జోలె పట్టారు.
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జనసేన, కాంగ్రెస్, ఆప్, ఇతర పార్టీల నాయకులు కోనేరు సెంటర్లో జోలె పట్టుకుని విరాళాలను సేకరించారు.
కోనేరు సెంటర్ నుంచి బస్టాప్ వరకు చంద్రబాబు, నాయకులు జోలె పట్టుకుని నడిచారు.
ప్రజలు, వ్యాపారులు భారీగా విరాళాలు ఇచ్చారు.
దీంతో మచిలీపట్నం కోనేరు సెంటర్ జనసంద్రమైంది.
రాజధానిగా అమరావతినే ఎందుకు కొనసాగించాలో వివరించేందుకు అమరావతి పరిరక్షణ కమిటీ ప్రజా చైతన్య యాత్రను చేపట్టింది.
















