అభ్యర్థులకు ఈసారి కొత్త రూల్స్ పెట్టిన ఎన్నికల సంఘం…ప్రస్తుతం సోషల్ మీడియా ఎంతటి విశ్వరూపం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ నెట్వర్కింగ్ సైట్ల కారణంగా ఎన్నికలు సైతం ప్రభావితమవుతున్న ఉదంతాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా, ఓటర్ నాడి పట్టడానికి, అతడిని ఆకర్షించడానికి సామాజిక మాధ్యమాన్ని మించింది లేదని ఆయా పార్టీలు ప్రత్యేకంగా విభాగాలు ఏర్పాటు చేసుకోవడం ఈ కోవలోకే వస్తుంది. అందుకే, కేంద్ర ఎన్నికల సంఘం ఓటరును ప్రలోభపెట్టే పార్టీలు, వ్యక్తులను నియంత్రించేందుకు కొత్త నియమావళి రూపొందించింది. తాజాగా విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ సందర్భంగా అభ్యర్థులకు కొన్ని సూచనలు చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో తప్పనిసరిగా తమ సోషల్ మీడియా అకౌంట్ల వివరాలను కూడా పొందుపరచాలని స్పష్టం చేసింది.

















