లోకసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, ఏపీ-తెలంగాణల్లో ఏప్రిల్ 11న ఎన్నికలు…సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు లోకసభ ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. పోలింగ్ తేదీలు, ఎన్ని దశల్లో ఎన్నికలు ఉంటాయనే వాటితో పాటు పలు అంశాలను సీఈసీ సునీల్ అరోరా ప్రకటించారు. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని సీఈసీ చెప్పారు. తొలిసారి ఈవీఎంలపై అభ్యర్థుల ఫోటోలు కనిపించనున్నాయి. ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు నిర్వహిస్తారు

















