తెలుగు ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పరిటాల సునీత
ఈ రోజు కర్నూలు లో జరుగుతున్న ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న మంత్రి పరిటాల సునీత ధర్మపోరాట దీక్ష వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాఖీ కట్టి, మిఠాయిలు తినిపించారు.
మంత్రితోపాటు టూరిజం శాఖ మంత్రి అఖిలప్రియ, ఎంపి బుట్టా రేణుక ముఖ్యమంత్రి గారికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కవచంలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని మంత్రి అన్నారు.
మమతానురాగాలకు, ప్రేమానుబందాలకు రాఖీ పండుగ నిదర్శనమని, అన్నా చెల్లెళ్ల అనురాగానికి, ఆత్మీయతకు రాఖీ పండుగ ప్రతీక అని మంత్రి అన్నారు.
ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ మంత్రి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.