ఏషియన్ పెయింట్స్ వేర్ ది హార్ట్ ఇజ్’ సీజన్ 9తో ప్రేక్షకుల ముందుకు
- ఐదుగురు ప్రముఖుల ప్రత్యేక గృహ యాత్రలు
- ‘వేర్ ది హార్ట్ ఇజ్ లుక్‌బుక్’ పరిచయం కూడా..
- భారతదేశంలో ప్రముఖ పెయింట్స్, డెకార్ సంస్థ ఏషియన్ పెయింట్స్ ఎంతో ఆదరణ పొందిన హోమ్ డెకార్, కథనాల ‘ఏషియన్ పెయింట్స్ వేర్ ది హార్ట్ ఇజ్’ 9వ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సీజన్లో ప్రముఖ వ్యక్తులైన సోనాక్షి సిన్హా – జాహీర్ ఇక్బాల్, గౌతమ్ గంభీర్, కీర్తి సురేష్ – ఆంటోనీ తట్టిల్, అర్చనా పురాణ్ సింగ్ – పర్మీత్ సేథి, అమన్ – ప్రియ గుప్తా ఇళ్లను ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది. ప్రతి ఇల్లు శైలి, భౌగోళిక నేపథ్యం, వ్యక్తిత్వం పరంగా భిన్నమైనా వాటన్నింటినీ ఏకం చేసే అంశాలు ఆత్మీయత, నిజాయితీ, భావోద్వేగ మాత్రమే. అర్చనా, పర్మీత్ కుటుంబం మధుర జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న మాధ్లోని ఆంగ్లో – స్పానిష్ శైలిలోని తమ ఇంట్లోకి ఆహ్వానిస్తారు. కీర్తి సురేష్ – ఆంటోనీ తట్టిల్ కోచి అపార్ట్మెంట్ ఆమెకు రంగులు, భావోద్వేగాలపై ఉన్న సహజమైన అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది. సోనాక్షి సిన్హా – జాహీర్ ఇక్బాల్ తమ పెంథౌస్ ‘సాదా’ ద్వారాలు తెరిచి నిశ్శబ్దమైన జ్ఞాపకాల మూలలను పంచుకుంటారు. వినియోగదారులు తమ ఇళ్ల కోసం రంగులు, డెకార్ ఆలోచనలను సులభంగా అర్థం చేసుకునేలా ‘ఏషియన్ పెయింట్స్ వేర్ ది హార్ట్ ఇజ్ లుక్‌బుక్’ ను కూడా ఈ సీజన్లో పరిచయం చేసింది. సహజ కాంతితో నిండిన గౌతమ్ ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అది నిశ్శబ్దం, క్రమశిక్షణ, ప్రశాంత క్షణాల కోసం రూపుదిద్దుకున్న స్థలం. అక్కడ ప్రత్యేకంగా రూపొందించిన క్రికెట్ స్మృతిచిహ్నాలు, సాధన కోసం కాకుండా వారసత్వానికి అంకితమైన గౌరవ సూచకంగా ఉంటుంది. అమన్, ప్రియల గురుగ్రామ్ ఇల్లు సౌలభ్యం, సృజనాత్మకత, కుటుంబంతో గడిపే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. పిల్లలు స్వేచ్ఛగా ఆడుకునే ఖాళీ ప్రదేశాలు, సహజంగా సాగిపోయే సంభాషణలు ఈ గృహానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ ఐదు ఇళ్లలో కనిపించేది ఒక్క పరిపూర్ణతే కాదు, వ్యక్తిత్వం, ప్రేమ కూడా. ఈ సీజన్లో రంగులు టెక్స్చర్ డెకార్ అంశాలు అలంకార ఎంపికలకన్నా, భావోద్వేగాలను వ్యక్తపరచే సాధనాలుగా ఎలా మారాయో? చూపిస్తుంది. బ్యూటిఫుల్ హోమ్స్ పెయింటింగ్ సర్వీసెస్ సహాయంతో అర్చనా లివింగ్ రూమ్‌లోని ‘వాల్ ఆఫ్ మెమరీస్’, కీర్తి సురేష్ బెడ్రూమ్లోని సంప్రదాయ అలంకరణలు ఏషియన్ పెయింట్స్ నిలయా ఆర్క్ పెర్లెసెంట్ లైమ్‌స్టోన్ ఫినిష్ ద్వారా మరింత అందంగా తయారయ్యాయి. గౌతమ్ ఇంటిలో నటాషా ఇష్టపడిన నిలయా ఆర్క్ మ్యాట్ వైట్ షేడ్ విలువైన క్రికెట్ జ్ఞాపకాలతో ఉంటుంది. సోనాక్షి ఇంటిలో ప్రత్యేక రాయల్ ప్లే వాల్-టు-ఫ్లోర్ టెక్స్చర్ గోడల నుంచి నేల వరకు విస్తరించి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సీజన్ 9లో రంగులు ఇంటికి వ్యక్తిగత భాషగా ఎలా మారాయో? కూడా స్పష్టంగా చూపించబడింది. ఈ సీజన్లో మరో ముఖ్యమైన కొత్త అంశం ‘ఏషియన్ పెయింట్స్ వేర్ ది హార్ట్ ఇజ్ లుక్‌బుక్’. ఇది షోలో కనిపించే ఇళ్లలో ఉపయోగించిన రంగులు, ఫినిష్‌లు, టెక్స్చర్లు, భావోద్వేగ కథనాలను వివరిస్తూ రూపొందించిన ప్రత్యేక డిజైన్‌తో కూడిన మార్గదర్శిని. ఈ లుక్‌బుక్ ద్వారా ప్రేక్షకులు ఆ ఇళ్ల సౌందర్యాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు. తమ ఇళ్ళలో కూడా అన్వయించుకోవచ్చు.


ఈ సందర్భంగా ఏషియన్ పెయింట్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అమిత్ సింగిల్ మాట్లాడుతూ ‘ఏషియన్ పెయింట్స్ వేర్ ది హార్ట్ ఇజ్’ తొమ్మిదవ సీజన్‌తో దశాబ్దాలుగా నిబద్ధతతో కొనసాగిస్తున్న ఒక ప్రయాణాన్ని గర్వంగా కొనసాగిస్తున్నామన్నారు. భారతీయులు తమ ఇళ్లను కేవలం నివసించే స్థలాలుగా మాత్రమే కాకుండా, తమ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ప్రతిరూపాలుగా చూడాలన్న దిశగా ఎప్పటి నుంచో పని చేస్తున్నామన్నారు. ఒక బిలియన్కు పైగా వ్యూస్‌తో ‘వేర్ ది హార్ట్ ఇజ్’ ఈ రోజు భారతదేశంలో అత్యధికంగా వీక్షించబడిన హోమ్ డెకార్ షోగా ఉందన్నారు. ఏళ్ల పాటు ఈ సిరీస్ రంగులు, డెకార్, డిజైన్ అంశాలపై వినియోగదారులకు మార్గనిర్దేశం చేసే ఒక అర్థవంతమైన వేదికగా రూపాంతరం చెందిందన్నారు. ట్రెండ్లను వివరిస్తూ ఆలోచనాత్మక డిజైన్ నిర్ణయాలు రోజువారీ జీవన నాణ్యతను ఎలా మెరుగుపరుస్తాయో? చూపిస్తోందన్నారు. రంగులు, డిజైన్‌పై అధికారం కలిగిన బ్రాండ్‌గా ఈ బాధ్యత మా ప్రతి చర్యలో కేంద్ర బిందువుగా ఉంటుందన్నారు. సీజన్ 9ను ప్రత్యేకంగా నిలబెట్టేది ‘ఏషియన్ పెయింట్స్ వేర్ ది హార్ట్ ఇజ్ లుక్‌బుక్’ అన్నారు. ఇది ప్రేక్షకులను కార్యరూపంలోకి తీసుకెళ్లే అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. ఈ షోలో కనిపించే రంగులు, పదార్థాలు, డిజైన్లు అర్థం చేసుకుని, వాటిని తమ ఇళ్ళలో అర్థవంతంగా అన్వయించుకునేలా ఇది సహాయపడుతుందని తెలిపారు. ఈ సీజన్లో ప్రదర్శించిన ఇళ్లు వ్యక్తిత్వాల వైవిధ్యం, వేర్వేరు వృత్తులు, ప్రాంతాలు, అభిరుచులను ప్రతిబింబిస్తూ ‘ఇల్లు’ అంటే ఒక ప్రత్యేక దృక్కోణాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ సీజన్ ద్వారా అందమైన ఇళ్లు అనేవి చాలా వ్యక్తిగతమైనవని మా నమ్మకాన్ని మరొకసారి పునరుద్ఘాటిస్తూ, ప్రజలు తమ కలల ఇళ్లను నిర్మించుకోవడంలో ఏషియన్ పెయింట్స్ తోడుగా నిలుస్తుందని పేర్కొన్నారు. వినియోగదారులు BeautifulHomes.comలోని ‘వేర్ ది హార్ట్ ఇజ్ లుక్‌బుక్’ ద్వారా ఈ షోలో ఉపయోగించిన ప్రత్యేకంగా ఎంపిక చేసిన రంగులు, ఫినిష్‌లు, డెకార్ శైలులు తెలుసుకుని, తమ ఇళ్ల కోసం ప్రేరణ పొందవచ్చు.

















