శ్రీశైలం ప్రాజెక్టుకు చెందిన 8 గేట్లను గురువారం అధికారులు ఎత్తివేశారు.
ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తున్న నేపధ్యంలో 8వ గేటును కూడా ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం ఇన్ఫ్లో 2.71 లక్షలు కాగా అవుట్ ఫ్లో 3.20 లక్షల క్యూసెక్కులుగా ఉంది.
అలాగే పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.5 అడుగులుగా ఉంది.
అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 207 టీఎంసీలుగా ఉంది.
కాగా… కుడి, ఎడమ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.
విజయవాడ నుంచి ప్రవహించే బందర్ కాలువతో పాటు మూడు కాలువలను సుందరంగా ఆకర్షణీయంగా అభివృద్ధి చేసే ప్రణాళికను సమీక్షించిన ముఖ్యమంత్రి