ముంబై నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో అంథేరీ ప్రాంతంలోని వంతెన కూలిపోయింది. ముంబై నగరంలో కురుస్తున్న భారీవర్షాలతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శ్యాం తలావ్, హింద్ మట, ఒబేరాయ్ మాల్, సీఎస్టీ రోడ్డు, కుర్లా, మాహిమ్ జంక్షన్, నెహ్రూనగర్ బ్రిడ్జి, శాంతాక్రజ్, చెంబూర్ లింక్ రోడ్డు ప్రాంతాల్లో వరద నీరు నిలిచింది. అంథేరి ఈస్ట్, వెస్ట్ ప్రాంతాలను కలిపి వంతెన కూలిపోవడంతో అక్కడ రైల్వేపోలీసులు, అగ్నిమాపక సిబ్బందిని నియమించారు