Vizag Vision: ESI Hospital will be developed a super specialty hospital Health Minister,Visakhapatnam..ఇ ఎస్ ఐ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖా మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు.స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తో కలసి షీలానగర్ లోని ఇ ఎస్ ఐ ఆస్పత్రికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇక్కడ ఆస్పత్రి నిర్మాణం జరిగితే అన్ని పరిశ్రమల కార్మికులకు అనువుగా ఉంటుందన్నారు.సుమారు వంద కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ఆస్పత్రిలో కార్మికులకు కావలసిన అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయన్నారు.చుట్టూ పరిశ్రమల్లో పనిచేస్తున్న వేలాది కార్మికులకు ఆరోగ్య ప్రదాయినిగా నిలుస్తుందన్నారు.ఆస్పత్రి నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని ముఖ్య మంత్రి చంద్రబాబు చెప్పారన్నారు.గత ప్రభుత్వాలు కార్మిక సంక్షేమాన్ని విస్మరిస్తే తెలుగు దేశం అధికారంలోకి వచ్చాక కార్మికులకు అన్ని సదుపాయాలు సమకూరుస్తుందని చెప్పారు.కార్యక్రమంలో కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు