HomeUncategorizedవాటర్ ప్రూఫింగ్ లో సూపర్ స్టార్ ఏషియన్ పెయింట్స్ డ్యాంప్ ప్రూఫ్…Visakhapatnam Vizagvision:దక్షిణాది ఇళ్లను లీకేజీ, వేసవి వేడి నుంచి కాపాడటమే లక్ష్యంగా ‘ఏషియన్ పెయింట్స్’ సరికొత్త ప్రచారం ప్రారంభించింది. తమ అగ్రశ్రేణి వాటర్ ప్రూఫింగ్ ఉత్పత్తి ‘డ్యాంప్ ప్రూఫ్’ను వాటర్ ప్రూఫింగ్ రంగంలో ‘సూపర్‌స్టార్’గా ఈ ప్రచారంలో అభివర్ణించింది. దక్షిణాదిలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘రౌడీ బేబీ’ పాట ట్యూన్‌ను వాడుకుంటూ సినిమా, సంగీతం మేళవింపుతో రూపొందించిన ఈ మ్యూజికల్ క్యాంపెయిన్ ద్వారా వినియోగదారులకు చేరువయ్యేందుకు సిద్ధమైంది. ఈ ఉత్పత్తి లీకేజీలను అరికట్టడమే కాకుండా ఇంటి ఉష్ణోగ్రతను పది డిగ్రీల వరకు తగ్గిస్తుంది. భారతదేశంలోని అనేక ఇళ్లలో టెర్రస్ (మిద్దె) అనేది వేడుకలకు, రోజువారీ కార్యకలాపాలకు ఒక ప్రధాన కేంద్రంగా ఉంటుంది. ప్రజలు తమ రోజువారీ జీవితంలో ఇంటి లోపల, బయట కూడా సమయాన్ని గడుపుతుంటారు. అయితే, ఇంటి పైకప్పు నుంచి నీరు కారడం లేదా ఇంట్లోకి వేడి పెరగడం వంటి సమస్యలు ఎదురైనప్పుడు రోజువారీ అస్తవ్యస్తమవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఏషియన్ పెయింట్స్ తన వాటర్ ప్రూఫింగ్ పరిష్కారం ‘ఏషియన్ పెయింట్స్ డ్యాంప్ ప్రూఫ్’ కోసం ఒక కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. సినిమా సంగీతాన్ని మేళవించి, ఇంటి రక్షణను సరళంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ క్యాంపెయిన్ ప్రదర్శిస్తోంది. దక్షిణ భారత దేశం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ప్రచారం అత్యంత ప్రజాదరణ పొందిన ‘రౌడీ బేబీ’ పాట నుంచి స్ఫూర్తి పొందింది. సంగీతం ద్వారా కథను వివరిస్తుంది. దక్షిణాది ప్రజల రోజువారీ జీవితంలో సినిమా, సంగీతం ఒక ముఖ్యమైన భాగం కాబట్టి, ఈ సుపరిచితమైన ఉత్సాహభరితమైన శైలి వాటర్ఫ్రూఫింగ్ అంశాన్ని మరింత ఆసక్తికరంగా, సులభంగా గుర్తుంచుకునేలా. అర్థమయ్యేలా చేస్తుంది. క్యాంపెయిన్ ప్రధాన ఉద్దేశం ఏషియన్ పెయింట్స్ డ్యాంప్ ప్రూఫ్‌ను వాటర్ ప్రూఫింగ్ కా సూపర్ స్టార్’ (వాటర్లోూఫింగ్లో సూపర్ స్టార్)గా నిలబెట్టడం. తమ శక్తివంతమైన, నమ్మకమైన నటనకు పేరొందిన దక్షిణాది సినీ స్టార్ల తరహాలోనే డ్యాంప్ ప్రూఫ్ కూడా అవసరమైన సమయంలో పటిష్టమైన రక్షణను ఇచ్చే ఒక నమ్మకమైన ఉత్పత్తిగా చూపబడింది. ఈ చిత్రం డ్యాంప్ ప్రూఫ్ రెండు ప్రధాన ప్రయోజనాలను తెలియజేస్తుంది. ఒకటి లీకేజీల నుంచి ఇంటికి గట్టి రక్షణ కల్పిస్తుంది. రెండు ఉష్ణోగ్రత నియంత్రణ, దీనిలోని అధునాతన ‘హీట్-రిఫ్లెక్టివ్ కోటింగ్’ (వేడిని ప్రతిబింబించే పూత) ఇంటి ఉపరితల ఉష్ణోగ్రతను 10 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గించడంలో సహాయపడుతుంది. భారీ వర్షాలు, సుదీర్ఘమైన వేసవి కాలం ఉండే ప్రాంతాల్లోని ఇళ్లకు ఇది ఎంతో ఉపయోగకరం.ఈ సందర్భంగా ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ అమిత్ సింగ్లే మాట్లాడుతూ భారతదేశంలోని అనేక ఇళ్లలో టెర్రస్లను వేడుకలకు, రోజువారీ పనులకు ఉపయోగిస్తారన్నారు. ప్రజల జీవనశైలిలో ఇంటి లోపలి భాగం, బయటి భాగం రెండూ కలిసి ఉంటాయన్నారు. అయితే, లీకేజీలు లేదా ఇంటి లోపల పెరుగుతున్న వేడి వంటి సమస్యలు ఎదురైనప్పుడు రోజువారీ జీవనం దెబ్బతింటుందన్నారు. ఈ నేపథ్యంలో ఏషియన్ పెయింట్స్ డ్యాంప్ ప్రూఫ్ విశిష్టతలను తెలియజేస్తూ ఈ కొత్త ప్రచారాన్ని ప్రారంభించామన్నారు. సినిమా, సంగీతం, ఇంటి రక్షణ అనే అంశాలను స్థానిక సంస్కృతికి తగ్గట్లుగా, అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ క్యాంపెయిన్‌లో మిళితం చేశామన్నారు. ఈ ప్రచారం వినియోగదారులకు వాటర్ఫ్రూఫింగ్ను గుర్తుండిపోయేలా చేయడమే కాకుండా, దక్షిణాదిలో ఇంటి రక్షణకు ఏషియన్ పెయింట్స్ డ్యాంప్ ప్రూఫ్‌ను ఒక సూపర్ స్టార్‌గా నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
వాటర్ ప్రూఫింగ్ లో సూపర్ స్టార్ ఏషియన్ పెయింట్స్ డ్యాంప్ ప్రూఫ్…Visakhapatnam Vizagvision:దక్షిణాది ఇళ్లను లీకేజీ, వేసవి వేడి నుంచి కాపాడటమే లక్ష్యంగా ‘ఏషియన్ పెయింట్స్’ సరికొత్త ప్రచారం ప్రారంభించింది. తమ అగ్రశ్రేణి వాటర్ ప్రూఫింగ్ ఉత్పత్తి ‘డ్యాంప్ ప్రూఫ్’ను వాటర్ ప్రూఫింగ్ రంగంలో ‘సూపర్‌స్టార్’గా ఈ ప్రచారంలో అభివర్ణించింది. దక్షిణాదిలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘రౌడీ బేబీ’ పాట ట్యూన్‌ను వాడుకుంటూ సినిమా, సంగీతం మేళవింపుతో రూపొందించిన ఈ మ్యూజికల్ క్యాంపెయిన్ ద్వారా వినియోగదారులకు చేరువయ్యేందుకు సిద్ధమైంది. ఈ ఉత్పత్తి లీకేజీలను అరికట్టడమే కాకుండా ఇంటి ఉష్ణోగ్రతను పది డిగ్రీల వరకు తగ్గిస్తుంది. భారతదేశంలోని అనేక ఇళ్లలో టెర్రస్ (మిద్దె) అనేది వేడుకలకు, రోజువారీ కార్యకలాపాలకు ఒక ప్రధాన కేంద్రంగా ఉంటుంది. ప్రజలు తమ రోజువారీ జీవితంలో ఇంటి లోపల, బయట కూడా సమయాన్ని గడుపుతుంటారు. అయితే, ఇంటి పైకప్పు నుంచి నీరు కారడం లేదా ఇంట్లోకి వేడి పెరగడం వంటి సమస్యలు ఎదురైనప్పుడు రోజువారీ అస్తవ్యస్తమవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఏషియన్ పెయింట్స్ తన వాటర్ ప్రూఫింగ్ పరిష్కారం ‘ఏషియన్ పెయింట్స్ డ్యాంప్ ప్రూఫ్’ కోసం ఒక కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. సినిమా సంగీతాన్ని మేళవించి, ఇంటి రక్షణను సరళంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ క్యాంపెయిన్ ప్రదర్శిస్తోంది. దక్షిణ భారత దేశం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ప్రచారం అత్యంత ప్రజాదరణ పొందిన ‘రౌడీ బేబీ’ పాట నుంచి స్ఫూర్తి పొందింది. సంగీతం ద్వారా కథను వివరిస్తుంది. దక్షిణాది ప్రజల రోజువారీ జీవితంలో సినిమా, సంగీతం ఒక ముఖ్యమైన భాగం కాబట్టి, ఈ సుపరిచితమైన ఉత్సాహభరితమైన శైలి వాటర్ఫ్రూఫింగ్ అంశాన్ని మరింత ఆసక్తికరంగా, సులభంగా గుర్తుంచుకునేలా. అర్థమయ్యేలా చేస్తుంది. క్యాంపెయిన్ ప్రధాన ఉద్దేశం ఏషియన్ పెయింట్స్ డ్యాంప్ ప్రూఫ్‌ను వాటర్ ప్రూఫింగ్ కా సూపర్ స్టార్’ (వాటర్లోూఫింగ్లో సూపర్ స్టార్)గా నిలబెట్టడం. తమ శక్తివంతమైన, నమ్మకమైన నటనకు పేరొందిన దక్షిణాది సినీ స్టార్ల తరహాలోనే డ్యాంప్ ప్రూఫ్ కూడా అవసరమైన సమయంలో పటిష్టమైన రక్షణను ఇచ్చే ఒక నమ్మకమైన ఉత్పత్తిగా చూపబడింది. ఈ చిత్రం డ్యాంప్ ప్రూఫ్ రెండు ప్రధాన ప్రయోజనాలను తెలియజేస్తుంది. ఒకటి లీకేజీల నుంచి ఇంటికి గట్టి రక్షణ కల్పిస్తుంది. రెండు ఉష్ణోగ్రత నియంత్రణ, దీనిలోని అధునాతన ‘హీట్-రిఫ్లెక్టివ్ కోటింగ్’ (వేడిని ప్రతిబింబించే పూత) ఇంటి ఉపరితల ఉష్ణోగ్రతను 10 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గించడంలో సహాయపడుతుంది. భారీ వర్షాలు, సుదీర్ఘమైన వేసవి కాలం ఉండే ప్రాంతాల్లోని ఇళ్లకు ఇది ఎంతో ఉపయోగకరం.ఈ సందర్భంగా ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ అమిత్ సింగ్లే మాట్లాడుతూ భారతదేశంలోని అనేక ఇళ్లలో టెర్రస్లను వేడుకలకు, రోజువారీ పనులకు ఉపయోగిస్తారన్నారు. ప్రజల జీవనశైలిలో ఇంటి లోపలి భాగం, బయటి భాగం రెండూ కలిసి ఉంటాయన్నారు. అయితే, లీకేజీలు లేదా ఇంటి లోపల పెరుగుతున్న వేడి వంటి సమస్యలు ఎదురైనప్పుడు రోజువారీ జీవనం దెబ్బతింటుందన్నారు. ఈ నేపథ్యంలో ఏషియన్ పెయింట్స్ డ్యాంప్ ప్రూఫ్ విశిష్టతలను తెలియజేస్తూ ఈ కొత్త ప్రచారాన్ని ప్రారంభించామన్నారు. సినిమా, సంగీతం, ఇంటి రక్షణ అనే అంశాలను స్థానిక సంస్కృతికి తగ్గట్లుగా, అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ క్యాంపెయిన్‌లో మిళితం చేశామన్నారు. ఈ ప్రచారం వినియోగదారులకు వాటర్ఫ్రూఫింగ్ను గుర్తుండిపోయేలా చేయడమే కాకుండా, దక్షిణాదిలో ఇంటి రక్షణకు ఏషియన్ పెయింట్స్ డ్యాంప్ ప్రూఫ్‌ను ఒక సూపర్ స్టార్‌గా నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.