VIZAGVISION:Fireworks moving in Auto fired,Driver live Death Eluru..ఆటోలో మంటలు ఏర్పడడంతో డ్రైవర్ సజీవ దహనమైన సంఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. జిల్లాలోని ఆకివీడు దగ్గర దీపావళీ సందర్బంగా బాణసంచాను భీమవరం నుంచి ఏలూరుకు ఆటోలో తరలిస్తున్నారు. అయితే… ప్రమాదవశాత్తూ ఆటోలో మంటలు చెలరేగడంతో ఆటో పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ నాగరాజు సజీవ దహనం కాగా సత్యనారాయణ, శ్రీనివాసులు అనే మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నప్పటికీ వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుడు నాగరాజు భీమవరానికి చెందిన వ్యక్తికాగా గాయపడ్డ సత్యనారాయణ, శ్రీనివాసులు ఏలూరుకు చెందిని సమాచారం.