VIZAGVISION:Fire Constable Liquor Mock Drill in Fire station,Visakhapatnam..విశాఖ పెద్దగంట్యాడ ఫైర్ స్టేషన్ లో మద్యం మత్తులో విదులకు హజరై మంగరాజు అనే ఫైర్ కానిస్టేబుల్ హంగామా చేశాడు. విదుల్లో ఫుల్లుగా మందు కొట్టి రావడమే కాకుండా ఫై అధికారులతో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాదు మాక్ డ్రిల్ లో మంగరాజు ఊగిపోతు మత్తులో జోగిపోతు కాసేపు నవ్వులు పంచాడు. అనంతరం అదికారులు తీసుకెళ్లి పక్కన కూర్చొబెట్టినా అక్కడ కూడా సరిగా కూర్చోలేక నానా హంగామా చేశాడు. ఈ ఘటన గాజువాక పెద్దగంట్యాడ ఫైర్ స్టేషన్ లో చోటు చేసుకుంది. ఈ తతంగాన్ని వీడియో తీసిన తోటి కానిస్టేబుల్ సోషల్ మీడియాలో మరో వ్యక్తితో షేర్ చేసుకోవడంతో ఈ వ్యవహరం బయటకు వచ్చింది.