ఎర్రకోటలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం సాయంత్రం ఎర్రకోటలో జరిగిన దసరా ఉత్సవాల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ తరఫున మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ… దసరా అనే కాకుండా ఏ పండుగ అయినా కేవలం వినోదంగా చూడరాదని.. అందులోని పరమార్థాన్ని గ్రహించాలని అన్నారు.
రాష్ట్రపతి కోవింద్ మాట్లాడుతూ… రాముడు అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు.
మరోవైపు రాంలీలా మైదాన్‌లో జరిగిన దసరా వేడుకలకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం హాజరయ్యారు.
ఇక దేశవ్యాప్తంగా రావణ దహన కార్యక్రమం జరిగింది.
దసరా సందర్భంలో తొమ్మిది రోజులు దుర్గాదేవిని ఆరాధించి చివరి రోజు రావణ, కుంభకర్ణ, మేఘనాథ్ బొమ్మలను దహనం చేశారు