దశాబ్దాలుగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న మైసూర్ దసరా వేడుకలను ఈసారీ అంగరంగ వైభవంగా నిర్వహించారు.అశ్వదళ కవాతు, అంబారీ వూరేగింపులతో వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి.
ప్రదర్శనలో బంగారు పల్లకి కనువిందు చేసింది.
ప్రత్యేకంగా నిర్మించిన వెండిపల్లకిలో మహారాజ యదువీర్ కృష్ణదత్త మైసూర్ వీధుల్లో విహరించారు.
వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు.
మైసూర్ మహారాణి త్రిషికా కుమారి దేవి ప్యాలెస్ నుంచే ప్రజలకు అభివాదం చేశారు.
ఉత్సవాలను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు నాయకులు తరలి వచ్చారు.
దసరా ఉత్సవాల నేపథ్యంలో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు.