రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారము విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు.
కశింకోట మండలం నర్సాపురం బ్యారేజీ వద్ద జలసిరికి జలహారతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
ఈమేరకు అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విశాఖ జిల్లా అధికారులకు సమాచారం అందింది.
దీంతో జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మతోపాటు ఎమ్మెల్యే పీలా గోవింద్ తదితరులు నర్సాపురం బ్యారేజీకి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు.