కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామం లో
కోతుల బెడద అధికంగా ఉంది Vizagvision
కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లీ గ్రామంలో కోతుల బెడద అధికంగా ఉంది. ఏడాది కాలం నుంచి ఈ సమస్య అధికంగా ఉంది. కుమ్మరకాలనీ, వీరవల్లీ – ఆగిరపల్లి రోడ్డు , మెయిన్ బజార్ , అర్ పి హెచ్ కాలనీ కోతుల తాకిడి ఎక్కువగా ఉంది. ప్రతి రోజు ఉదయం వచ్చి సాయంత్రం ఇళ్ల మధ్యనే ఉంటున్నాయి. ఇళ్లల్లో కూరగాయలు, పండ్లు , సామాన్లు ఇలా దొరికిన వస్తువుల్లా ఎత్తుకుపోతున్నాయి. కూరగాయలు మొక్కలు జామ , మామిడి , కొబ్బరి చెట్లు ఎక్కి కాయలు కొసి పాడుచేస్తున్నాయి. రేకులు షెడ్డు ఇళ్లు పై దూకుతూ రేకులను పగలగొడుతున్నాయి. వాటి బయట పంపే ప్రయత్నం చేస్తుంటే జనాల పై దాడులు చేస్తున్నాయి. ఆగిరపల్లి మల్లవల్లి , నూజివీడు ప్రాంతాల నుంచి కోతలు గుంపులు గుంపులుగా తరలివస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు స్పందించి కోతుల బెడద నుంచి తప్పించాలని వేడుకుంటున్నారు.

















